Prices: సామాన్యులకు షాక్..నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం..!

పండుగ సీజన్ లో ప్రజలకు షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సన్న బియ్యం ధరలు భారీగా పెరిగాయి. అంతే కాదు.. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, కూరగాయలు ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు మళ్లీ పెంచాల్సి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. జులై-సెప్టెంబరులో పెరిగిన ముడి సరకుల ఖర్చుల వల్ల తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నామని.. ఫలితంగా అక్టోబరు-మార్చిలోనూ లాభాల మార్జిన్లపై మరింత ఒత్తిడి ఏర్పడుతుందని పేర్కొంటున్నాయి. అందువల్ల డిసెంబరు నుంచి ఉత్పత్తుల ధరలు పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. సెప్టెంబరు త్రైమాసికంలో పామాయిల్‌ ధర వార్షికంగా 21 శాతం, చక్కెర ధర 18 శాతం పెరిగాయి.

ముడి చమురు ఆధారిత ఉత్పత్తులు, ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల నిర్వహణ లాభాలు వార్షికంగా 45-150 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుత దసరా-దీపావళి పండగ సీజన్‌లో గిరాకీ తగ్గకుండా చూసేందుకు, కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచకుండా వేచి చూస్తున్నాయని తెలిసినవారు చెబుతున్నారు. అయితే వ్యయాల నియంత్రణకు డిస్కౌంట్లు తగ్గించడం, ప్రకటనల ఖర్చుల్లో కోత విధించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ధరలు పెంచితే గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులు తక్కువ ధర కలిగిన బ్రాండ్లకు మారడం లేదా చిన్న ప్యాకెట్లను కొనడం వంటివి చేస్తారని భావిస్తున్నారు.

FMCG

ప్రస్తుత త్రైమాసికంలో ఎల్‌నినో ప్రభావం బలంగా ఉంటే, అది వ్యవసాయ దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ కమొడిటీల ధరలకు తోడు, భౌగోళిక-రాజకీయ పరిస్థితుల ఆధారంగా డిసెంబరు నుంచి ఉత్పత్తుల ధరల పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. అటు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ఆయిల్ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. ధరలు పెంచాలని చూస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి.

దీంతో ఆయిల్ కంపెనీలు నష్టాలను భరిస్తూ పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నాయి. ఇలానే కొనసాగితే కంపెనీలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు ప్రభుత్వం ఒకే చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్ధితులను బట్టి చూస్తే వచ్చే ఐదారు నెలలు ప్రజలకు కాస్త ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంది. అన్నింటి ధరలు పెరిగే అవకాశం ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+