Gold: బంగారం ఇప్పుడే కొనుగోలు చేయాలా.. లేకా ఆగాలా..!
బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. శనివారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 తగ్గి రూ.1, 25,080 వద్ద స్థిరపడింది. తులం 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.450 తగ్గి రూ.1,14,650 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర రూ.370 తగ్గి రూ.93,810 వద్ద కొనసాగుతోంది. అయితే బంగారం ధర గరిష్ట స్థాయి నుంచి దాదాపు 30 శాతం తగ్గింది. ఏ ఏడాది జనవరిలో తులం 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 1,79,000 వరకు వెళ్లింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుకుంటూ 14 నెలల కనిష్టానికి పడిపోయింది.
బంగారం ధరలు భారీగా తగ్గడంతో చాలా మంది బంగారం కొనడానికి సిద్ధమవుతున్నవారు. అయితే పసిడి ధర ఇంకా తగ్గితే ఎలా అని ఆలోచిస్తున్నారు. బంగారం కొన్న తర్వాత ధరలు ఇంకా తగ్గితే నష్టపోతామని భయపడుతున్నారు. ఒక వేళ పసిడి ధరలు పెరిగితే వచ్చే అవకాశం వదులుకున్న వారిమి అవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తెలిసిన వారిని బంగారం ధరలు ఇంకా తగ్గుతుందా.. పెరుగుతుందా అని అడుగుతున్నారు. చాలా మంది బంగారం కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు. పసిడి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో బంగారం దుకాణాల్లో సందడి తగ్గింది.

పెళ్లిళ్లు ఉన్నవారు బంగారం కొనుగోలు చేస్తున్నారు. వారు కూడా రెండు, మూడు రోజుల గ్యాబ్ తో కొంత కొంత పసిడిని కొనుగోలు చేస్తున్నారు. అయితే నిపుణుల అంచనా ప్రకారం బంగారం ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. డాలర్ బలపడడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాతో పసిడి ధరలు పతనమవుతున్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ లో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో పక్క మొన్నటి వరకు టన్నుల కొద్ది బంగారం కొనుగోలు చేసిన వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు కొనుగోలు చేయడం తగ్గించినట్లు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గినా.. దీర్ఘకాలంలో పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు.. కొంత కొంత కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఫీజికల్ గోల్డ్ కాకున్నా.. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చని సూచిస్తున్నారు. సిప్ రూపంలో బంగారంలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలం మంచి రాబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications