Iran Crude Oil: 5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి చేసిన ఇరాన్.. మరి ధర తగ్గుతుందా..!

ఇరాన్ భారీ ఎత్తున ముడి చమురును ఎగుమతి చేస్తోంది. ఇరాన్ ముడి చమురుపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇరాన్ ఎగుమతులు భారీగా పెరిగాయి. ఇరాన్ ఇంధన ఎగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి ఇరాన్ దాదాపు 5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేసిందని ట్యాంకర్-ట్రాకింగ్ సంస్థ బట్టి తెలుస్తోంది. ఈ ఎగుమతి యుద్ధానికి ముందున్న ఎగుమతుల స్థాయిల కంటే చాలా తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. అమెరికా, ఇరాన్ మధ్య జూన్ 17న ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు యూఎస్ ట్రెజరీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఒప్పందం ప్రకారం అమెరికా ఇరాన్ చమురుపై తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేసింది. ఆగస్ట్ 21 వరకు ఇరాన్ తమ ముడి చమురు అమ్ముకోవడానికి అవకాశం కల్పించింది. యుద్ధానికి ముందు కంటే సుమారు 20% అధిక ధరలకు చమురును అమ్ముతోందని పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ మంగళవారం తెలిపారు. దాదాపు నాలుగు నెలల యుద్ధానికి ముగింపు పలికి, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు అమెరికా, ఇరాన్ ఒప్పందానికి వచ్చాయి. శాశ్వత శాంతి ఒప్పందం కోసం 60 రోజుల చర్చలకు రంగం సిద్ధం చేసేందుకు అమెరికా, ఇరాన్‌లు జూన్ 17న ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Crude Oil

ఇరాన్ డ్రోన్లు రెండు నౌకలపై దాడి చేయడంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితులు సర్దుమణిగాయి. దౌత్యపరమైన పురోగతి, గల్ఫ్ సరఫరా పునరుద్ధరణ అంచనాల కారణంగా బ్రెంట్ క్రూడ్ బుధవారం బ్యారెల్‌కు $73 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇది ఏప్రిల్‌లో యుద్ధ సమయంలో గరిష్టంగా ఉన్న $118 డాలర్లుగా ఉండే. అక్కడి నుంచి దాదాపు 40 శాతం తగ్గింది. 60 రోజుల గడువు ముగిసిన తర్వాత జలసంధిని మూసేస్తారా లేక ఓపెన్ చేసి ఉంచుతారా అని చూడాలని నిపుణులు చెబుతున్నారు. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు ఉపయోగిస్తారన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనను ఘాలిబాఫ్ తోసిపుచ్చారు.

ముడి చమురు ధర తగ్గడం కూడా భారత్ కలిసొస్తుంది. ఎందుకంటే భారత్ తన అవసరాల్లో దాదాపు 80 శాతానికి పై విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు ధర భారీగా పెరిగితే భారత్ పై ప్రభావం పడుతుంది. ఒకవేళ ధరలు తగ్గితే భారత్ మేలు జరిగినట్లేనని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ లో కూడా ఇదే విధంగా ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరల కూడా తగ్గే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+