కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతా రామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో బంగారం కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. దీంతో ఆ సమయంలో బంగారం ధర భారీగా తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ పసిడి ధర పెరుగుతూ వస్తోంది. శుక్రవారం కూడా పుత్తడి ధర పెరిగింది. ప్రస్తుతం తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,620 ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 65,650గా ఉంది. వెండి కిలో ధర రూ.82,900గా ఉంది.
గత మూడు రోజులుగా పుత్తడి ధర పెరుగుతూ వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,800 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,770 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెంట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,500గా ఉండగా.. తులం 22 క్యారెంట్ల పుత్తడి ధర రూ. 65,540గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,500గా ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.65,690గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,540 ఉండా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500 గా ఉంది. ఇక
చెన్నైలో తులం 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 65,540 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.71,500 గా ఉంది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి రూ.1000 పెరిగి రూ. 88,500కు చేరుకుంది. ఊహించిన దాని కంటే తక్కువగా US జాబ్ డేటా తర్వాత US మాంద్యం భయం పెరగడం వల్ల బంగారం ధర నేడు పెరుగుతోందని కమోడిటీ మార్కెట్ నిపుణుల చెబుతున్నారు.
బలమైన US జాబ్ డేటా US మాంద్యం భయాన్ని దెబ్బతీసిందని.. US ఫెడ్ రేటు తగ్గింపు ఆశలు ప్రకాశవంతమయ్యాయని అంచనా వేస్తున్నారు. యుఎస్ డాలర్ ఇండెక్స్ 103 మార్క్ దిగువకు పడిపోయినందున యుఎస్ డాలర్ (యుఎస్డి) రేటు కూడా ప్రాఫిట్ బుకింగ్‌ను చూసిందని వారు తెలిపారు. దేశీయంగా డిమాండ్ పెరగడం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications