RBI: డెబిట్ కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త చె్పపింది. ఇక నుంచి డెబిట్ కార్డు లేకున్నా.. ఏటీఎంల్లో డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. డేబిట్ కార్డు లేకున్నా యూపీఐ సహాయంతో డబ్బులు డ్రా చేసుకోవచ్చని పేర్కొంది. ఉదాహరణకు మీరు స్టేట్ బ్యాంక్ ఇండియా ఖాతారుడు అనుకుంటే.. మీరు మీ డెబిటి కార్డును ఇంట్లు మరిచిపోయి ఏటీఎం వెళ్లారనుకోండి.
మీరు వెళ్లిన ఏటీఎం యూపీఐ సౌకర్యం ఉంటే.. డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా అన్ని ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొంది బ్యాంకు యాప్ లు ఉపయోగించి కూడా డబ్బులు డ్రా చేసుకోవచ్చని వివరించింది. ఎస్బీఐ యోనో, ఐసీఐసీఐ మొబైల్ యాప్ తో కూడా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

ఎలా విత్ డ్రా చేయాలంటే..
1. ముందుగా మీ ఫోన్ లో గూగుల్ పే, ఫోన్ పే, లేదా మీ బ్యాంకుకు చెందిన యూపీ యాప్స్ ఉండాలి.
3. ATM స్క్రీన్‌పై 'QR క్యాష్' ఎంచుకోండి
6. నగదు విత్‌డ్రా చేసుకోవడానికి మీకు రెండు ఆప్షన్‌లు ప్రదర్శించబడతాయి, అంటే రూ. 2,000, రూ. 4,000. మీ అవసరానికి అనుగుణంగా ఒక ఎంపికను ఎంచుకోండి.
7. తర్వాత యూపీఐ యాప్‌లోని 'క్యూఆర్ క్యాష్ విత్‌డ్రాయల్' ఆప్షన్‌ని ఉపయోగించి ఏటీఎం స్క్రీన్‌పై ప్రదర్శించబడే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.
8. ఆ తర్వాత నగదు ATM ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.

సాంకేతిక లోపం కారణంగా ATMలో ఉపసంహరణ విఫలమైతే, మీ ఖాతా నుంచి డెబిట్ అయితే, వెంటనే మీ బ్యాంక్‌కు తెలియజేయండి. ఏడు పని దినాలలోపు మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో తిరిగి జమ చేస్తారు.RBI మార్గదర్శకాల ప్రకారం, మీరు UPI ATM సౌకర్యం ద్వారా ప్రతి నెలకు గరిష్టంగా రూ. 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా విత్ డ్రా చేయడం వల్ల పిన్ టైప్ చేయం కాబట్టి.. కార్డు క్లోనింగ్ ప్రమాదం తగ్గుతుంది.


Click it and Unblock the Notifications