Gold Loans: బంగారం ధరలు తగ్గడంతో బ్యాంకుల ఆందోళన.. పసిడి రుణాల వసూళ్లుపై దృష్టి..!
బంగారం ధరలు జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతం పడిపోయాయి. దీంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పసిడి ధరల ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఎంత వరకు తగ్గుతుందో అంచనా వేయలేకపోతున్నారు. బంగారం ధరల తగ్గడం వల్ల పసిడిపై రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సాధారణ బంగారం రుణాలు రుణం-తనఖా నిష్పత్తితో అందిస్తారు. పసిడిపై గరిష్ఠంగా 75 శాతం ఎల్టీవీతో లోన్లు ఇస్తారు. ఉదాహరణకు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,50,000 ఉంది అనుకుంటే. 75 శాతం ఎల్టీఏతో రూ.1,12,500 వరకు రుణం ఇచ్చే అవకాశం ఉంది.
ఓ వ్యక్తి తులం బంగారం రూ.1,50,000 ఉన్నప్పుడు లోన్ తీసుకుంటే రూ.1,12,500 వస్తాయి. అయితే ఇప్పుడు పసిడి ధర రూ.1,25,000 తగ్గిపోయింది. అప్పుడు 75 శాతం ఎల్టీవీతో పోలిస్తే రూ.93,750 చేరుతుంది. అంటే బ్యాంక్ భద్రతా మార్జిన్ తగ్గుతుంది. బంగారం రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకుంటే బ్యాంక్ నష్టపోయే అవకాశం ఉంది. బ్యాంకులు ఆ బంగారాన్ని వేళం వేసి డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు బంగారం ధర 15 శాతం తగ్గే అవకాశం ఉంటే బ్యాంకులు ఇంకా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే బ్యాంకులు, ఎన్భీఎఫ్సీలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.5120 తగ్గి రూ.1,25,570 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 4700 తగ్గి 1,15, 100 వద్ద ట్రేడవుతోంది. తులం 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.3840 తగ్గి రూ.94,180 పలుకుతుంది. అయితే రుణాలు ఇచ్చిన సంస్థలు రుణాలు వసూలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త బంగారం రుణాలు జారీ చేయడం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ లో బంగారం ధర కీలకమైన మద్దతు స్థాయి అయిన రూ.1,22,000- రూ.1,22,800 వద్ద స్థిరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి తగ్గితే..రూ.1,18,000-రూ.1,19,000 మధ్యకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఒక వేళ పెరిగితే రూ.1,26,300 నుంచి రూ.1,27,000 మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్వల్ప కాలంలో పసిడి ధరలు దాదాపుగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు భారీగా తగ్గడంతో గోల్ట్ స్టాక్స్ ఒత్తిడిని ఎదుర్కుంటున్నాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో టైటాన్ కంపెనీ, కళ్యాణ్ జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్ షేర్లు 10 శాతం కంటే ఎక్కువగా క్షీణించాయి. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు నిలివేయడం, డాలర్ బలపడితే బంగారం మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యం చైనా సెంట్రల్ బ్యాంక్ పసిడి కొనుగోలు నిలిపివేస్తే ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications