జియో సినిమా అత్యధిక ప్రీమియం కంటెంట్-ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని వినియోగదారులకు ఉచితంగా అందించడంతో మిగతా ఓటీటీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. జియో సినిమా ఫ్రీగా కెంటంట్ ఇవ్వడంతో ఫలితంగా డిస్నీ ప్లస్ మొబైల్ కస్టమర్‌లకు క్రికెట్ వరల్డ్ కప్‌ను ఉచితంగా అందించాల్సి వచ్చింది. భారతదేశంలోని OTT మార్కెట్ ప్రస్తుతం ధర-సెన్సిటివ్ మార్కెట్‌లో వృద్ధి, లాభదాయకత మధ్య గందరగోళాన్ని ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు.
2023 IPL ను జియో సినిమాలో ఫ్రీగా అందించారు. దీంతో జియో సినిమా వినియోగించే వారి సంఖ్య పెరిగింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు లాభదాయకతపై దృష్టి పెట్టే యోచనలో ఉన్న నేపథ్యంలో 2024లో ఓటీటీల్లో కొన్ని తీవ్రమైన మార్పులను ఆశించవచ్చు.2017లో దేశంలోకి వీడియో OTT వచ్చినప్పటి నుంచి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఏవీ బ్రేక్-ఈవెన్ పాయింట్‌ను చేరుకోలేకపోయాయి. ఇది ఈ మార్కెట్‌లో కొన్ని నిర్మాణాత్మక మార్పులకు దారితీయవచ్చు. దీని అర్థం జియో సినిమా కూడా ఇక నుంచి ఫ్రీగా కంటెంట్ అందించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

చాలా పెద్ద OTT ప్లాట్‌ఫారమ్‌లు విపరీతమైన నష్టాలను చవిచూస్తున్నందున.. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రాంతీయ ఓటీటీలు ప్రస్తుతం సమయంలో నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. అందుకే తెలుగు, తమిళ పని చేస్తున్న ఆహాను అమ్మాలని ప్రమోటర్లు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటీలకు సబ్‌స్క్రిప్షన్ రాబడితో పాటు యాడ్స్ ద్వారా ఆదాయం వస్తుంది. అయితే డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్ సెర్చ్, సోషల్, ఇ-కామర్స్ దిగ్గజాల ఉనికితో ఛిన్నాభిన్నం అయినందున ప్యూర్ ప్లే వీడియో అడ్వర్టైజింగ్ మోడల్‌ల స్థాయిని ఊహించలేమని నిపుణులు చెబుతున్నారు.
OTT ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటి వరకు ధరలను విస్తృతంగా పెంచలేకపోవచ్చు. కాని భవిష్యత్ లో పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద, లాభదాయకతతో పాటు బలమైన వృద్ధిని సాధించడం కోసం ఓటీటీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications