EV Stocks: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగానికి రానున్నది స్వర్ణ యుగమని నిపుణులు అంటున్నారు. భారత ప్రభుత్వం సైతం ఇంధనంతో నడిచే వాహనాలకు మరో ఐదేళ్లలో శెలవు పలకాలని యోచిస్తోంది. దీనిపై నితిన్ గడ్కరీ ఈ ఏడాది కీలక ప్రకటన కూడా చేశారు.

సూపర్ వేగంతో ముందుకు..
EV పరిశ్రమలు గత సంవత్సరంలో స్టాక్ మార్కెట్‌లో సూపర్ రాబడిని అందించిన తర్వాత.. ఈ వృద్ధి ఇతర అనుబంధ రంగాలకు కూడా చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. EV పరిశ్రమ అన్నిక్యాటగిరీల్లో 52% CAGR వేగంతో వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉందని వారు అంటున్నారు. ఈవీ పరిశ్రమకు ప్రభుత్వ అనుకూల విధానాల కారణంగా ఆటో కాంపోనెంట్ పరిశ్రమ ఆదాయం 75% CAGRతో వృద్ధి చెందుతోంది.

6 కోట్ల ఉద్యోగాలు..
EV కంపెనీలు, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు, కాంపోనెంట్ కంపెనీల వల్ల 2030 నాటికి కోటి ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో పరోక్షంగా మరో 5 కోట్ల మంది ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలను పొందుతారని వారు చెబుతున్నారు.

లాభపడే స్టాక్స్ ఇవే..
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వృద్ధి కారణంగా ఏథర్ ఎనర్జీ (హీరో), హీరో ఎలక్ట్రిక్, ఆంపియర్ (గ్రీవ్స్ కాటన్), TVS, ఓలా ఎలక్ట్రిక్, బజాజ్ ఆటో కంపెనీలు ఫోకస్ లో ఉన్నాయి. ఇదే సమయంలో.. ఆటో కాంపోనెంట్ సరఫరాచేసే మదర్‌సన్ సుమి, బస్సు తయారీదారు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్న టాటా పవర్ స్టాక్స్ ఏడాది కాలంలో పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేశాయి. వీటికి తోడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న ఇతర ప్రముఖ కంపెనీలు సైతం లాభాలు కురిపించనున్నాయి.

ఈ కంపెనీలు కూడా..
ఆటోమోటివ్ లైటింగ్ సొల్యూషన్స్ కంపెనీ లుమాక్స్ ఇండస్ట్రీస్, ఎక్స్‌ట్రూషన్ కంపెనీ కాబ్రా ఎక్స్‌ట్రూషన్‌టెక్నిక్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ ఫోర్జ్ పరిశ్రమలో వేగవంతమైన వృద్ధిని ప్రభావితం చేయవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ కొత్తది కాబట్టి ఇందులో ఎదురయ్యే ఎక్కువ ఛార్జింగ్ సమయం, ఛార్జింగ్ స్టేషన్ల ఇన్ఫాస్ట్రక్చర్ వంటి సమస్యల పరిష్కారానికి మరింత సమయం పట్టవచ్చు. ఇందుకోసం మరికొన్ని ఆవిష్కరణలు అవసరం కావచ్చని ఆటో రంగ నిపుణులు అంటున్నారు. బ్యాటరీల పేలుడు వంటి సమస్యలు త్వరలోనే పరిష్కరించబడుతుందని అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications