Tata Sons: టాటా సన్స్ తర్వాతి ఛైర్మన్ ఎవరు.. ఎవరీ టీవీ నరేంద్రన్.. !
టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేయడం.. టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు అనేది అప్పుడే చర్చలు మొదలయ్యాయి. చంద్రశేఖరన్ స్థానంలో ఎవరు వస్తారనేది ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే చంద్రశేకరన్ ఫిబ్రవరి 2027 వరకు ఛైర్మన్‌గా కొనసాగుతారని భావిస్తున్నందున, కొత్త ఛైర్మన్ ఎంపికపై టాటా సన్స్‌కు తగినంత సమయం ఉంది. టాటా సన్స్ నిబంధనల ప్రకారం, ఛైర్మన్‌ను ఐదుగురు సభ్యుల కమిటీ ఎంపిక చేస్తుంది. ముగ్గురు సభ్యులను సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ (SRTT) సంయుక్తంగా నామినేట్ చేస్తాయి. ఒకరిని టాటా సన్స్ బోర్డు నామినేట్ చేస్తుంది. ఐదవ సభ్యుడు బోర్డుచే ఎంపిక చేయబడిన స్వతంత్ర సభ్యుడు ఉంటారు.
మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ ఆదేశం కారణంగా ట్రస్టీ సమావేశాలను నిర్వహించలేకపోతున్నందున SRTT ప్రస్తుతం ఇందులో పాల్గొనలేకపోతోంది. నోయెల్ టాటా తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గ్రూప్ విధానం ప్రకారం నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు పదవీ విరమణ వయస్సు 70 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ విధానం ప్రకారం ఆయన నవంబర్‌లో ఇతర టాటా గ్రూప్ కంపెనీల బోర్డుల నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ట్రస్ట్ నామినీ కావడం వల్ల టాటా సన్స్ డైరెక్టర్‌గా కొనసాగుతారు, ఎందుకంటే ట్రస్ట్ నామినీలకు పదవీ విరమణ వయస్సు పరిమితి వర్తించదు.

2016లో సైరస్ మిస్త్రీని ఛైర్మన్ పదవి నుంచి తొలగించినప్పుడు, రతన్ టాటా స్వయంగా ఛైర్మన్ పదవి నుండి వైదొలిగిన నాలుగేళ్ల తర్వాత, 78 ఏళ్ల వయసులో తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత బోర్డు స్థిరత్వం కోసం చంద్రశేఖరన్‌ను నియమించింది. ఈసారి నోయెల్ అదే మార్గాన్ని అనుసరించలేకపోవచ్చు. టాటా సన్స్ సవరించిన నిబంధనల ప్రకారం, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ టాటా సన్స్ ఛైర్మన్‌గా కూడా కొనసాగడానికి వీల్లేదు.ఈ నిబంధనను 2022లో ప్రవేశపెట్టారు. ఈ రెండు పదవులను నిర్వహించిన చివరి వ్యక్తి రతన్ టాటానే.
టాటా సన్స్ ఛైర్మన్ పదవి రేసులో ప్రధానంగా టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్, 61 ఏళ్ల టీవీ నరేంద్రన్ పేరు వినిపిస్తుంది. 1988లో టాటా గ్రూప్‌లో చేరిన నరేంద్రన్, తన వృత్తి జీవితమంతా టాటా స్టీల్‌లోనే గడిపారు. 2013 నుంచి టాటా స్టీల్ కు నాయకత్వం వహిస్తున్నారు. టాటా సన్స్ డైరెక్టర్, టాటా ట్రస్ట్స్ చైర్మన్ అయిన నోయెల్ టాటా, టాటా స్టీల్ వైస్-ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నరేంద్రన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications