కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్నిరంగాల మీద , అన్ని పరిశ్రమల మీద పడింది . కరోనా దెబ్బకు దేశంలో ఉత్పత్తి రంగం తీవ్రంగా దెబ్బ తింది. ఇక చెక్కెర పరిశ్రమల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా లాక్ డౌన్ కు ముందు నుద్నే చెక్కెర పరిశారమాలు నష్టాల ఊబిలో చిక్కుకుని కష్టాలు పడుతున్నాయి. ఇక కరోనా లాక్ డౌన్ కూడా ఇప్పుడు వాటికి తోడయ్యింది. దీంతో తీవ్ర ఆర్దిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి చెక్కెర ఫ్యాక్టరీలు .

నష్టాలలో ఉన్న చెక్కెర ఫ్యాక్టరీలకు లాక్ డౌన్ తో మరింత నష్టాలు
మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా నష్టాల ఊబిలో ఉన్న చక్కెర కంపెనీలకు లాక్‌డౌన్ తో మరిన్ని తిప్పలు పెరిగాయి . లాక్ డౌన్ తో ఉత్పత్తి నిలిచిపోవటం అటుంచి ఉన్న నిలవలే సరఫరా చేయటంలో ఇబ్బందులు , కార్మికులకు లాక్ డౌన్ సమయంలో చెల్లించాల్సిన వేతనాలు , అలాగే బాకులకు చెల్లించాల్సిన రుణ వాయిదాలు వెరసి చెక్కెర కంపెనీలు చేదు అనుభవం చవి చూస్తున్నాయి. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా 50 శాతం మేర అమ్మకాలు పడిపోయిన పరిస్థితి కూడా చెక్కెర పరిశ్రమలను కుదేలు చేస్తుంది.

రోజు రోజుకీ తగ్గుతున్న షుగర్ ఫ్యాక్టరీలు .. నష్టాలే కారణం
ఇప్పటికే చాలా ఫ్యాక్టరీల వద్ద షుగర్ నిల్వలు పేరుకుపోయాయి. దారుణంగా ఆదాయం తగ్గింది. వ్యయం పెరిగింది. దీంతో ఈ రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని కంపెనీల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకు సుమారు 22 లక్షల టన్నుల చక్కెర అమ్ముడవుతోంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం గత సీజన్లో భారత్‌లో 172 మిల్లులు చక్కెర ఉత్పత్తి చేశాయి. కానీ ప్రస్తుత సీజన్లో ఈ సంఖ్య 139కి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చాలా ఫ్యాక్టరీలు నష్టాలను భరించలేక మూత పడ్డాయి.

ఉత్పత్తి వ్యయం పెరగటం , విక్రయ ధరలు తగ్గటంతో నష్టాలు
ఉత్పత్తి వ్యయం పెరగటం , విక్రయ ధరలు తగ్గటంతో నష్టాలను చవి చూస్తున్నాయి షుగర్ ఫ్యాక్టరీలు . 100 కిలోల బస్తా చక్కెర ఉత్పత్తి వ్యయం ప్రస్తుతం రూ.4,000 పైమాటే. మిల్లుల వద్ద విక్రయ ధర మాత్రం రూ.3,400 ఉంది. అంటే ఒక్కో బస్తాపై కంపెనీలు రూ.600 నష్టం మూటగట్టుకుంటున్నాయి. చిన్న కంపెనీలకైతే∙రూ.700 వరకు నష్టం వస్తోంది. ఇక పరిస్థితులు ఇలా ఉంటె కరోనా లాక్ డౌన్ కూడా దెబ్బమీద దెబ్బ కొట్టింది .

చెక్కెర విక్రయ ధర పెంచితేనే గట్టెక్కే పరిస్థితి
ఇక ఈ పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే చెక్కెర విక్రయ ధర పెంచాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ తదనంతరం ఫ్యాక్టరీ రన్ చేసినా సరే తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఆరు నెలలకుపైగా సమయం పడుతుంది. మిల్లు వద్ద విక్రయ ధర పెరిగితే తప్ప ఈ పరిశ్రమ రికవరీ జరిగే అవకాశం లేదని భావిస్తున్నారు. ఏది ఏమైనా కరోనా కష్టకాలం, అసలే నష్టాల్లో ఉన్న చెక్కెర ఫ్యాక్టరీలను మరింత నష్టాల్లోకి తోసేసింది . ఇక ప్రభుత్వాలు ఆదుకుంటాయనే ఆలోచన పరిశ్రమల వర్గాలకు అసలు లేదు .
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications