Market Closing: సరికొత్త గరిష్ఠాలకు నిఫ్టీ సూచీ.. ఐటీ, ఫార్మా ర్యాలీతో దూకుడు..
Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు గ్లోబల్ మార్కెట్ల గందరగోళంలోనూ స్థిరంగా లాభాల ప్రయాణాన్ని కొనసాగించాయి. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో ఐటీ, ఫార్మా రంగాలకు చెందిన స్టాక్స్ పనితీరు అండగా సూచీలకు నిలిచాయి. వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని ఆశావాదం మధ్య డిమాండ్ పునరుద్ధరణ ఉంటుందని ఐటీ రంగంలోని షేర్లు భారీగా పెరుగుదలను చూస్తున్నాయి.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 74 పాయింట్లు గెయిన్ కాగా, మరో కీలక సూచీ నిఫ్టీ సూచీ ఇంట్రాడేలో సరికొత్త రికార్డు గరిష్ఠం 25,129.60 స్థాయికి చేరుకుంది. అయితే చివరికి 35 పాయింట్ల గెయిన్ నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 135 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ నష్టాన్ని నమోదు చేశాయి. నిఫ్టీ వరుసగా 10 రోజులుగా పెరిగినప్పటికీ నేడు లాభాల బుకింగ్‌ను రికార్డు స్థాయిలో చూసింది. ఎఫ్‌ఐఐలు నికర కొనుగోలుదారులను మార్చడంతో పాటు వచ్చే నెలలో యూఎస్ ఫెడ్ త్వరలో రేట్ల కోత విధించడం వంటి అనేక అంశాలు సూచీలు సానుకూలలో బుల్ జోరును నింపాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో ఎల్ టిఐఎమ్, విప్రో, దివీల్ ల్యాబ్, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, హిందాల్కొ, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో మారుతీ, ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, నెస్లే, టాటా కన్జూమర్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా, హీరో మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, టైటాన్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications