Ibrahim Raisi Death: ఇరాన్ ప్రెసిడెండ్ ఆకస్మిక మృతి.. భారత్‌కు కలిగే నష్టాలివే..!!
Chabahar Port Project: నిన్న ఒక ప్రాజెక్ట్ ఓపెనింగ్ కోసం వెళ్లి తిరిగివస్తున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో ప్రమాదానికి గురైంది. భారీ సెర్చ్ ఆపరేషన్ తర్వాత నేడు శకలాలను రెస్కూ టీమ్స్ గుర్తించాయి. దీంతో ఆయన అధికారిక మృతి ధృవీకరించబడింది.
తాజాగా ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని మోదీ తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత్-ఇరాన్ సంబంధాలను మెరుగుపరచడంలో రైసీ పాత్రను మోదీ కొనియాడారు. ఈ క్రమంలో రైసీ కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సంతాప సమయంలో ఇరాన్‌కు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి రైజీ మరణంతో నేడు పిసిడి, ముడి చమురు ధరలు ర్యాలీని నమోదు చేయగా.. స్టాక్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రైసీ మృతి భారతదేశం, భారత వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చబహార్ పోర్టు నిర్వహించడానికి ఇరాన్‌తో భారతదేశం ఒక ఒప్పందంపై సంతకం చేయటం ఒక ప్రధాన అడుగని చెప్పుకోవాలి. 2003లో భారత్ తొలిసారిగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా, ఇరాన్ అణు కార్యకలాపాలపై అమెరికా ఆంక్షలు విధించడంతో ఓడరేవు అభివృద్ధి నిలిచిపోయింది. చాలా ఆలస్యం తర్వాత చబహార్ ఓడరేవు కోసం ఇరాన్-భారత్ గత వారం ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది జరిగిన కొద్దిరోజులకై ఇరాన్ అధ్యక్షుడు మరణించటం పెద్ద షాక్ కి గురిచేస్తోంది. అలాగే అమెరికా నుంచి ఈ ఒప్పందం విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఇరాన్‌తో వాణిజ్యం చేస్తున్న వారిపై ఆంక్షలు విధించవచ్చని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ హెచ్చరించారు. అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పోర్ట్ ప్రాంతీయ ప్రయోజనాలను నొక్కిచెప్పారు. వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ ఆకస్మిక మరణం భారత్ సంతకం చేసిన సబహార్ పోర్ట్ ఒప్పందంపై ప్రభావం చూపవచ్చు. ఇరాన్ రాజకీయాలు, ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. కొనసాగుతున్న సంఘర్షణ, అస్థిరత కారణంగా ఎన్నికలను నిర్వహించడానికి ఇరాన్ రాజ్యాంగంలో 50 రోజుల గడువు అసంభవం అని చెప్పబడింది.
ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్షుడి మార్పు చబహార్ పోర్ట్ నిర్మాణ ప్రణాళిక అమలును మరింత ఆలస్యం చేయెచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ మొదటి వైస్ ప్రెసిడెంట్ 68 ఏళ్ల మహ్మద్ మోగ్బర్, హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మరణించిన తరువాత రాజ్యాంగబద్ధంగా దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications