Jack Dorsey: హిండెన్‌బర్గ్ ఎవరినానా టార్గెట్ చేస్తే అస్సలు గురితప్పదు. ఇది అతిశయోక్తి అస్సలు కాదు. ఎందుకంటే జనవరి నెలాఖరులో భారత వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ను టార్గెట్ చేస్తూ షార్ట్ సెల్లర్ విడుదల చేసిన రిపోర్టు వల్ల కలిగిన అల్లకల్లోలం నుంచి గౌతమ్ అదానీ ఇప్పటికీ పూర్తిగా తేరుకోలేదు.
అమెరికాకు చెందిన బ్లాక్ ఇంక్ సంస్థను తాజాగా Hindenburg టార్గెట్ చేయటంతో దాని సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే టార్గెట్ అయ్యారు. దీంతో ఆయన సంపద కరిగిపోవటం ప్రారంభమైంది. కేవలం గురువారం ఒక్కరోజే ఆయన సంపద విలువ దాదాపు 526 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది. ఇది ఆయన జీవితంలోనే అత్యంత చెడ్డ రోజుగా చెప్పుకోవచ్చు. సంచలన నివేదిక విడుదల కావటంతో డోర్సే సంపద 11% తగ్గిన తర్వాత అతని విలువ ప్రస్తుతం 4.4 బిలియన్ డాలర్లకు దిగజారింది.

గురువారం అమెరికా మార్కెట్లలో బ్లాక్ ఇంక్ కంపెనీ షేర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో స్టాక్ గరిష్ఠంగా ఇంట్రాడేలో 22 శాతం క్షీణించింది. చివరికి మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ 15 శాతం నష్టపోయింది. సీఈవోగా ఉన్న డోర్సే సంపదలో ఎక్కువ భాగం బ్లాక్ కంపెనీలో పెట్టుబడిగా ఉందని తెలుస్తోంది. ఆయన కంపెనీలో దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన ఇన్వెస్ట్మెంట్లను కలిగి ఉన్నాడని తెలుస్తోంది.

ఇలాంటి సంచల విషయాలను, కుంభకోణాలను వెలుగులోకి తీసుకొస్తున్న అమెరికా రీసెర్చ్ సంస్థను నాథన్ ఆండర్సన్ నడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లను గుర్తించటం వారి వ్యాపారాలపై సంచలన రిపోర్టులను ఇవ్వటం ఇదే మెుదటి సారి కాదు. ఒకానొక సమయంలో ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి అయిన అదానీ ఇప్పుడు 60 బిలియన్ డాలర్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ రిచ్ లిస్ట్‌లో 21వ స్థానంలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications