HDFC: భారతదేశంలో దిగ్గజ బ్యాంకుగా కొనసాగుతున్న ప్రైవేటు రుణదాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. HDFC-HDFC Bank కలయికతో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద బ్యాంకుగా అవసరిస్తోంది.
విలీనం పూర్తైన తర్వాత స్వదేశీ కంపెనీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకుల్లో ర్యాంక్‌ను పొందుతుంది. అమెరికా, చైనాలకు చెందిన బ్యాంకుల సరసన నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. 172 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో JP మోర్గాన్, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ అమెరికా తర్వాత నిలిచింది.

హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్ప్‌ను.. తాజా చర్యతో HDFC బ్యాంక్ లిమిటెడ్ తనలో విలీనం చేసుకుంటోంది. ఇది అధికారికంగా జూలై 1, 2023 నుంచి అమలులోకి వస్తోంది. అంటే రేపటి నుంచి రెండూ కలిపి ఒక్కటే కంపెనీగా కొనసాగనున్నాయి. రెండు కంపెనీలు కలిసిన తర్వాత ఏర్పడే కొత్త HDFC బ్యాంక్ ఎంటిటీకి దాదాపు కోటి 20 లక్షల మంది కస్టమర్లు ఉండనున్నారు. ఇది మెుత్తం జర్మనీ జనాభా కంటే ఎక్కువని తెలుస్తోంది. దీంతో బ్రాంచ్ నెట్‌వర్క్ సంఖ్య 8,300కి, ఉద్యోగుల సంఖ్య 177,000 కంటే ఎక్కువకు చేరుకోనుంది.
ప్రస్తుతం వినీనం వల్ల బ్యాంక్ కస్టమర్ల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ఈ కలయిక సమీప భవిష్యత్తులో బ్యాంక్ స్టాక్ పెరుగుదలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాబోయే నాలుగేళ్లలో శాఖలను రెట్టింపు చేయడం ద్వారా 18-20 శాతం వృద్ధిని సాధించాలని ప్రైవేటు బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. HDFC వంటి విజయవంతమైన ప్రైవేట్ బ్యాంకులు.. దేశంలో బ్యాంకుల జాతీయీకరణ వెనుక తప్పును నిరూపించాయి. ప్రస్తుతం ప్రైవేటీకరణపై ప్రభుత్వం కాస్త నిదానంగా వ్యవహరిస్తోంది.


Click it and Unblock the Notifications