Gold: బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా.. పసిడి ధర తగ్గినా మళ్లీ పెరుగుతుందా..!

బంగారం గత సంవత్సర కాలంలో మంచి రాబడి ఇచ్చింది. సంవత్సరం క్రితం బంగారంలో పెట్టుబడి పెట్టిన వారి సొమ్ము డబుల్ అయింది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం, అలాగే ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని భావించి భారీగా పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. ఒకానొక సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,000 వరకు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,46,510 గా ఉంది.

అయితే ఈ సమయంలో బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చా.. లేక ఇంకా బంగారం ధర తగ్గే అవకాశం ఉందా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అలాగే వెండి ధర కూడా భారీగా పెరిగి.. ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పెట్టుబడిదారుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయత రాబర్ట్ కియోసాకి బంగారం, వెండిపై తన అభిప్రాయాలను తెలియజేశారు. బంగారం, వెండి ధరలు తగ్గుతున్నా తాను మాత్రం విక్రయించడం లేదని చెబుతున్నారు. సరైన సమయంలో బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.

Gold

అగ్రరాజ్యం అమెరికాతోపాటు వివిధ దేశాల ఆర్థిక పరిస్థితి బాలేదని అన్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి, బిట్ కాయిన్ తో పాటు ఇథీరియంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బంగారం ధర భారీగా పెరగడానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తన అభిప్రాయాల కంటే.. సొంతంగా పరిశోధించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మార్కెట్ నిపుణులు మాత్రం బంగారం ధర భారీగా తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు. ఒకవేళ తగ్గినా.. దానికి సమయం పడుతుందని పేర్కొంటున్నారు.

బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు క్రమక్రమంగా పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. నెలనెలా కొంత మొత్తంలో బంగారం పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. దీని వల్ల నష్ట భయం ఉండదని చెబుతున్నారు. పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెడితే రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే బంగారం ధర గత సంవత్సరం కాలంగా పెరిగినట్లు భవిష్యత్ లో పెరగదని అంచనా వేస్తున్నారు.

మరోపక్క అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడం వల్ల ఈక్విటీ మార్కెట్ లోకి పెట్టుబడులు పెరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తే పసిడి ధర తగ్గే అవకాశం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టే వారు గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఫిజికల్ గా గోల్డ్ కొనుగోలు చేయడం కంటే గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టడం బెటర్ అని చెబుతున్నారు. అయితే పలు నివేదికల ప్రకారం బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+