Gold: టన్నుల కొద్ది బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. మళ్లి పెరగనున్న పసిడి ధరలు..!
బంగారం ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. చైనానే కాకుండా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడి కొనుగోలు చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం ప్లాన్ ప్రకారం పుత్తడిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ కంట్రీ వద్ద సెప్టెంబర్ 2026 నాటికి నిల్వలు 2,410 టన్నులకు చేరాయి. ఆ దేశ కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా సెప్టెంబర్లో 23 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్ 2023 తర్వాత ఒకే నెలలో జరిగిన అతిపెద్ద కొనుగోలు ఇదేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. డ్రాగన్ కంట్రీ వరుసగా 23 నెలలుగా తన బంగారు నిల్వలను పెంచుకుంటూ వస్తోంది.
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చైనా మొత్తం 103 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 63 టన్నుల బంగారాన్ని నిల్వ చేసింది. 2023 మూడో త్రైమాసికం తర్వాత ఇదే అతిపెద్ద త్రైమాసిక కొనుగోలుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరిస్తుుంది. చైనా మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 8.5 శాతానికి పెరిగింది. విదేశీ కరెన్సీలో ఉన్న ఆస్తుల విలువ తగ్గడం వల్ల, సెప్టెంబర్లో చైనా మొత్తం విదేశీ మారక నిల్వలు 2 శాతం తగ్గి దాదాపు $3.8 ట్రిలియన్లకు చేరాయి. సెప్టెంబర్లో బంగారం ధరలు తగ్గిన సమయంలో చైనా భారీగా కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకుని, తన విదేశీ మారక నిల్వలను మరింత సురక్షితం చేసుకోవడమే చైనా లక్ష్యంగా ఈ పసిడి కొనుగోలు జరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. డాలర్లలో విలువ కట్టే ఆస్తుల విలువ ఆ దేశ పనితీరు, దాని ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. చైనా వ్యూహం కేవలం సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాదని నిపుణులు చెబుతున్నారు. భౌతిక బంగారం వ్యాపారం, చెల్లింపుల పరిష్కారాల కోసం హాంకాంగ్ను ఒక ప్రధాన ప్రపంచ కేంద్రంగా మార్చడానికి కూడా డ్రాగన్ ప్రయత్నిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా బంగారం భారీగా కొనుగోలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
చైనాలో బంగారం డిమాండ్ పెరుగుదల కేవలం ప్రభుత్వ స్థాయిలో మాత్రమే లేదని.. చైనీస్ గోల్డ్ ETFలు సెప్టెంబర్లో 11 టన్నుల బంగారాన్ని చేర్చుకున్నాయి. ఇది వరుసగా మూడవ నెల నిల్వల పెరుగుదల అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ఇటు భారత్ లో కూడా గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఫలితంగా బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే పసిడి ధర తగ్గినప్పుడల్లా కాస్త కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications