Indian Investments: భారతీయ ఇన్వెస్టర్లు, పెట్టుబడి మార్కెట్ గత 3 సంవత్సరాలుగా విపరీతమైన మార్పు, అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలోనూ అనేక ప్రముఖ పెట్టుబడిదారులు, పెట్టుబడి సంస్థలు కరోనా కాలంలో కూడా మంచి లాభాలను చూశాయి. అయితే ప్రస్తుతం 2022 సంవత్సరం మాత్రం ఆర్థికంగా చాలా చెడ్డ దశను ఎదుర్కొంటోంది.

చైనా-తైవాన్ లలో ఇన్వెస్టర్ల పరిస్థితి..
ప్రస్తుత పరిస్థితులను గమనించినట్లయితే.. ముఖ్యంగా అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ భారీ క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ పెట్టుబడుల విలువ కూడా భారీగా క్షీణించటం ప్రస్తత పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిస్థితిలో.. చైనా - తైవాన్ మధ్య సమస్యలో అంరికా జోక్యం పెట్టుబడిదారులకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. ఈ తరుణంలో చైనా-తైవాన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఏమిటి..? ఇప్పుడు చూద్దాం..

భారత ఇన్వెస్టర్లు..
భారతీయ ఇన్వెస్టర్లు ఏళ్ల తరబడి అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశీయ ఇన్వెస్టర్లు కొన్నేళ్ల క్రితం తమ పెట్టుబడులను చైనా, హాంకాంగ్, తైవాన్‌లతో కూడిన గ్రేటర్ చైనా ప్రాంతానికి తరలించారు. ఈ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది మంచి రాబడులు ఆర్జించారు. అయితే.. గత కొన్నేళ్లుగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని ఒప్పుకోక తప్పదు.

తలనొప్పిగా చైనా-తైవాన్ సమస్య..
చైనా-తైవాన్ సమస్య తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఆ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన భారతీయ ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. చైనా, హాంకాంగ్, తైవాన్ మార్కెట్లను కలిగి ఉన్న గ్రేటర్ చైనా ప్రాంతంపై దృష్టి సారించే మూడు భారతీయ ఈక్విటీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటి పనితీరుపై ప్రభావం పడనుంది.

యాక్సిస్, నిప్పాన్ ఫండ్స్..
యాక్సిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఫిబ్రవరి 2021లో ప్రారంభమైంది. ఈ స్కీమ్ పెట్టుబడి విలువ ఏడాది కాలంలో 22% తగ్గింది. డిసెంబర్ 2021లో ప్రారంభించిన నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇది ప్రారంభం నుంచి 30% తగ్గింది. ఈ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రస్తుతం కన్నీరే మిగిలిందని చెప్పుకోక తప్పదు.

చైనాలో పెట్టుబడులు ఇలా..
2009లో ప్రారంభించబడిన ఎడెల్వీస్ గ్రేటర్ చైనా ఈక్విటీ 28% పడిపోయింది. విదేశీ పెట్టుబడులపై నియంత్రణ పరిమితుల కారణంగా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కొత్త పెట్టుబడులను నిలిపివేసింది.

ఆంక్షలతో నష్టాలు..
ఈ భారీ క్షీణతకు కేవలం చైనా-తైవాన్ మాత్రమే కాదు, గత సంవత్సరాల్లో చైనా ప్రభుత్వ టెక్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలపై కఠిన చర్యలు, ఆంక్షల వల్ల కూడా సంభవించింది. ఇప్పుడు చైనా తైవాన్‌పై దాడి చేస్తే.. మ్యూచువల్ ఫండ్ కంపెనీల పెట్టుబడుల్లో నష్టం 50 శాతానికి మించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆశగా పెట్టుబడులు పెట్టిన అనేక మందికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఊహించని షాక్ ఇచ్చాయని చెప్పుకోవాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications