Stock Market: బుల్స్ జోరులో దలాల్ స్ట్రీట్.. భారీగా పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..
Closing Bell: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఫుల్ జోష్ నెలకొంది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డు స్థాయిలను చేరుకున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ సూచీ 250 పాయింట్లు పెరిగింది.
అయితే మార్కెట్లు ముగిసే సమయంలో ఇన్వెస్టర్లు లాభాల బుక్కింగ్ కోసం ప్రయత్నించటంతో సూచీల లాభాలు కొంత మేర ఆవిరయ్యాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 500 పాయింట్ల లాభంలో ముగియగా.. నిఫ్టీ సూచీ 155 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ 206 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 224 పాయింట్ల మేర లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి.

NSEలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, టాటా మోటార్స్, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, ఎల్ టి, ఎన్టీపీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యూపీఎల్, కోల్ ఇండియా, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ ముగించాయి.
హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టపోయి టాప్ లూజర్లుగా ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications