Egg Price Hike: కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. ఒక్కో కోడి గుడ్డ ధర రూ.9..!

కోడి గుడ్ల ధరలు కొండెక్కాయి. రిటైల్ మార్కెట్ ఒక్కో కోడి గుడ్డు రూ.8.50 నుంచి రూ.9 పలుకుతుంది. దీంతో కోడి గుడ్ల కొనడం సామాన్యులకు భారంగా మారింది. హైదరాబాద్ లో రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.9 రూపాయల వరకు పలుకుతోంది. 12 గుడ్లు కొనాలంటే రూ.108 చెల్లించాల్సి వస్తోంది. హోల్ సేల్ లో ఒక్కో కోడి గుడ్డు రూ.8 నుంచి రూ.8.5 పలుకుతుంది. ప్రస్తుతం చలి కావడం, పైగా వచ్చే నెలలో క్రిస్మస్, న్యూ ఇయర్ ఉండడం వల్ల కోడి గుడ్ల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కోడి గుడ్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం దాణా ఖర్చులు భారీగా పెరగడం.

పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్లకు మొక్కజొన్న, సోయాబీన్, నూకలు ఆహారంగా ఇస్తారు. ప్రస్తుతం మక్కల ధరలు భారీగా పెరిగాయి. అటు నూకల ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది కిలో మొక్కజొన్న ధర దాదాపు రూ.19 ఉండగా ఇప్పుడు కిలో రూ. 34కు చేరింది. నూకల ధర కూడా కిలో రూ.14 నుంచి రూ.32కు పెరిగింది. మొక్కజొన్నను ఇథనాల్ తయారీకి ఉపయోగించడంతో డిమాండా భారీగా పెరిగింది. ఫలితంగా మక్కలు ధరలు పెరిగాయి. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ తయారీకి మొక్కజొన్నను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అందుకే పౌల్ట్రీ పరిశ్రమకు అందుబాటులో ఉండే మొక్కజొన్నపై డిమాండ్ ఒత్తిడి పెంచిందని చెబుతున్నారు.

Egg Price

మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన మొక్కజొన్న పండించే రాష్ట్రాల్లో వర్షపాతం లోటు కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ మొక్కజొన్న ఉత్పత్తి 15 నుంచి 16 శాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్ లీనో కారణంగా ధరలు పంటల దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు మొక్కజొన్న కొని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో మక్కలకు డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. పౌల్ట్రీ యజమానులకు పౌల్ట్రీ నిర్వహణ ఖర్చు పెరగడంతో వారు ధరలు పెంచుతున్నారు. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో చికెన్, గుడ్లు ఎక్కువగా తింటారు. ముఖ్యంగా ఉత్తరాది చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది.

డిమాండ్ కు సరిపడ గుడ్ల ఉత్పత్తి లేకుంటే ధరలు పెరుగుతాయి. డిసెంబర్ గుడ్ల ధర ఒక్కోటి రూ.10 చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ నాటికి గుడ్లు, చికెన్ ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+