Wipro Share Price: దేశీయంగా నేడు ఐటీ కంపెనీల షేర్లు బూమ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో నుంచి ఒక శుభవార్త ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల తలరాతను మార్చేసిన విప్రో కంపెనీ త్వరలోనే మరోసారి ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించటానికి సిద్ధం అవుతోందని తెలుస్తోంది.
టెక్ కంపెనీ మరోసారి తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను అందించాలని చూస్తోంది. దీంతో 14వ సారి కూడా విప్రో తన ఇన్వెస్టర్లకు ఉచితంగా షేర్లను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను అక్టోబర్ 17న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బోర్డు సమావేశం కానుంది. టెక్ దిగ్గజం విప్రో ఈ క్రమంలో ఫలితాలతో పాటు, షేర్ల బోనస్ ఇష్యూను కూడా ప్రకటించనున్నట్లు అక్టోబర్ 13 నాటి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ప్రకారం వెల్లడైంది.

2019 తర్వాత కంపెనీ 14వ సారి తన ఇన్వెస్టర్లకు ఉచిత షేర్లను అందించటానికి తాజాగా సిద్ధం అవుతోందని వెల్లడైంది. దీనికి ముందు కంపెనీ 1971, 1981, 1985, 1987, 1989, 1992, 1995, 1997, 2004, 2005, 2010, 2017. 2019లో తన ఇన్వెస్టర్లకు ఉచిత షేర్లను బహుకరించింది. చివరిగా 2019లో 1:3 రేషియోలో బోనస్ షేర్లను ఇన్వెస్టర్లకు అందించింది. ఇప్పటికే టెక్ దిగ్గజం టీసీఎస్ తన ఫలితాలను వెల్లడించిన వేళ.. ఫలితాలతో పాటు, రాబోయే త్రైమాసికంలో ఆదాయ వృద్ధిపై విప్రో మార్గదర్శకత్వంపై అందిరి దృష్టి ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దేశీయ బ్రోకరేజ్ కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విప్రో రాబోయే త్రైమాసికానికి 0.5% ఆదాయ క్షీణత నుంచి 1.5% వృద్ధికి మార్గనిర్దేశం చేస్తుందని అంచనా వేస్తోంది.
దీర్ఘకాలిక పెట్టుబడిదారుల సంపదను ఐటీ స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులతో రెట్టింపు చేసింది. గడచిన 16 ఏళ్ల కాలంలో బలమైన రాబడి అందించిన టెక్ కంపెనీ షేర్ల ధర 2008 అక్టోబర్ 10న రూ.59.28 వద్ద ఉంది. ఈ ధర వద్ద కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే అప్పటి షేర్ల సంఖ్య 1686 స్థాయి నుంచి ప్రస్తుతం 7493కి పెరిగాయి. దీనికి కారణంగా కంపెనీ ఇప్పటి వరకు దాదాపు 13 సార్లు బోనస్ షేర్లను ఇష్యూ చేయటమే. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 7493 విప్రో షేర్ల విలువ రూ.40 లక్షలు దాటిపోయింది.
ఇంట్రాడేలో మధ్యాహ్నం 1.33 గంటల సమయంలో విప్రో షేర్ల ధర ఎన్ఎస్ఈలో రూ.549 వద్ద కొనసాగుతోంది. కంపెనీ బోనస్ షేర్లను ప్రకటించిన తర్వాత మార్కెట్లో దాదాపు 4 శాతం మేర షేర్లు లాభాలను చూశాయి. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.579.90గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.375.05 వద్ద ఉంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.87 లక్షల కోట్లుగా కొనసాగుతోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications