Wipro News: దేశీయ స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో శనివారం టెక్ దిగ్గజం విప్రోలో పెద్ద పరిణామం చోటుచేసుకుంది. సీఈవోగా ఉన్న థియరీ డెలాపోర్టే హఠాత్తుగా తన రాజీనామా ప్రకటించటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది.
ఇది ఐటీ సేవల రంగంలోని కంపెనీల అగ్రనాయకత్వాలు ఎదుర్కొంటున్న టఫ్ పరిస్థితులకు అద్దం పడుతోందని కొందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సోమవారం మార్కెట్లు తెరచుకోగానే టాప్ టెక్ కంపెనీల్లో ఒకటైన విప్రో షేర్లలో పతనం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ రాజీనామా కంపెనీ నాలుగో త్రైమాసిక ఫలితాలకు ముందు రావటం కంపెనీకి పెద్ద దెబ్బని చెప్పుకోవాలి.

ప్రస్తుతం దేశంలోని ఐటీ సేవల కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధం అవుతున్నాయి. ముందుకు టీసీఎస్ నుంచి ఇవి ప్రారంభం అవుతుండగా.. విప్రో తన ఫలితాలను కూడా వచ్చే వారంలో వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే టెక్ కంపెనీల ఆదాయాలు సైతం తగ్గుతాయని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్న వేళ విప్రో విషయంలో ఇది ఎంత వరకు ఉంటుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. దీంతో సోమవారం విప్రో కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి నాలుగేళ్ల కిందట సీఈవో, ఎండీగా థియరీ డెలాపోర్టే విప్రోలో బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా తాను కంపెనీని వీడాలనుకుంటున్నట్లు ప్రకటించి రాజీనామాను బోర్డుకు అందించారు. దేశంలో అత్యధికంగా వార్షిక వేతనంగా 85 కోట్ల రూపాయలు అందుకుంటున్న టెక్ సీఈవోగా రికార్డు ఉన్నప్పటికీ సడెన్ రాజీనామా సర్వత్రా చర్చకు దారితీసింది. ఆయన స్థానంలో కంపెనీలోనే 30 ఏళ్లకు పైగా పనిచేసిన శ్రీనివాస్ పల్లియాను విప్రో బోర్డు కొత్త సీఈవో, ఎండీగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో విప్రో ఒక్కో షేర్లు ధర స్వల్ప క్షీణతతో రూ.485 రేటు వద్ద ప్రయాణాన్ని ముగించింది. ప్రస్తుత పరిస్థితులతో విప్రో షేర్లపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు.
1992లో విప్రోలో ఉద్యోగిగా చేరిన శ్రీనివాస్ పల్లియా కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా తన కెరీర్ జర్నీని ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో కన్స్యూమర్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్‌తో సహా అనేక నాయకత్వ పదవులను నిర్వహించారు. విద్యార్హతలను పరిశీలిస్తే.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని పొందారు. దీనికి తోడు మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో అడ్వాన్స్‌డ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో గ్లోబల్ లీడర్‌షిప్, స్ట్రాటజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో కోర్సును పూర్తి చేశారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications