ఐటీ రంగంలో గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితి మధ్య, ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. దాదాపు ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న శాలరీ హైక్ (salary hike) ప్రక్రియను మార్చి 1, 2026 నుండి ప్రారంభించనున్నట్లు కంపెనీ అంతర్గత వర్గాల సమాచారం. గతేడాది సెప్టెంబర్ 2024లో జరగాల్సిన ఈ పెంపు ప్రక్రియ ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనకు ఈ నిర్ణయంతో తెరపడనుంది.

ఎందుకు ఆలస్యమైంది?
సాధారణంగా ఐటీ కంపెనీలు ఏటా ఏప్రిల్ లేదా సెప్టెంబర్ మాసాల్లో జీతాల పెంపును చేపడుతుంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, క్లయింట్ల ఖర్చు తగ్గింపు, ఐటీ సేవల డిమాండ్‌లో మందగమనం కారణంగా విప్రో ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. జనవరిలో జరిగిన క్వార్టర్లీ రిజల్ట్స్ సందర్భంగా కంపెనీ హెచ్ఆర్ హెడ్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ.. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్ తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నట్లుగానే ఇప్పుడు మార్చి నుండి పెంపును అమలు చేసేందుకు సిద్ధమైంది.
వేరియబుల్ పే , బేసిక్ హైక్
జీతాల పెంపు ఆలస్యమైనప్పటికీ, విప్రో తన ఉద్యోగులకు వేరియబుల్ పే విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు. డిసెంబర్ 31, 2025తో ముగిసిన త్రైమాసికానికి గాను 100% వేరియబుల్ పేను ప్రకటించింది. ఇది ఫిబ్రవరి నెల జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ కానుంది. అంతకుముందు రెండు త్రైమాసికాల్లో కూడా 90% పైగా వేరియబుల్ పే చెల్లించడం విశేషం. ఇప్పుడు బేసిక్ శాలరీలో కూడా పెంపు ఉండబోతుండటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర కంపెనీల పరిస్థితి ఎలా ఉంది?
విప్రో మాత్రమే కాదు, టిసిఎస్ (TCS), ఇన్ఫోసిస్ వంటి ఇతర ఐటీ దిగ్గజాలు కూడా ఇదే విధమైన జాగ్రత్త ధోరణిని అవలంబించాయి. టిసిఎస్ సెప్టెంబర్ నుండి 2% నుండి 8% వరకు పెంపును అందించగా ఇన్ఫోసిస్ రెండు దశల్లో 5% నుండి 8% వరకు జీతాలను పెంచింది. కాగ్నిజెంట్ కూడా నవంబర్ నుండి తన పెంపు ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పుడు విప్రో కూడా ఈ జాబితాలో చేరడంతో ఐటీ రంగంలో మళ్లీ సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
ప్రస్తుతానికి ఎంత శాతం జీతం పెరుగుతుందనే (Percentage of Hike) విషయంపై విప్రో యాజమాన్యం ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. అయితే కంపెనీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 5.5% పెరిగి రూ. 23,555.8 కోట్లకు చేరుకుంది. నికర లాభం స్వల్పంగా తగ్గినప్పటికీ.. ఉద్యోగుల నైపుణ్యాన్ని నిలుపుకోవడానికి , వారిని ప్రోత్సహించడానికి ఈ శాలరీ హైక్ (salary hike) నిర్ణయం కంపెనీకి ఎంతో కీలకం కానుంది. మార్చి మొదటి వారం నుండి ఉద్యోగులకు తమ కొత్త జీతాల వివరాలు తెలిసే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications