దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీలలో ఒకటైన విప్రో ఫ్రెషర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. అంతర్గత పరీక్ష తర్వాత పేలవమైన పనితీరు కనబరిచిన వందలాది మంది ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించింది. పనితీరు సరిగా లేని 452 మంది ఫ్రెషర్ ఉద్యోగులను తీసేసింది. శిక్షణ తర్వాత కూడా పనితీరు మెరుగుపరుచుకోవడంలో విఫలమైనందుకు వారిని ఇంటికి పంపించింది.

అత్యున్నత ప్రమాణాలు
"విప్రోలో, అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. మేము మన కోసం సెట్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రమాణాలకు అనుగుణంగా, ప్రతి ఎంట్రీ-లెవల్ ఉద్యోగి వారి నియమించబడిన పని ప్రాంతంలో నిర్దిష్ట స్థాయి నైపుణ్యాన్ని కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము" అని కంపెనీ తెలిపింది.

800 మంది
"మూల్యాంకన ప్రక్రియలో సంస్థ వ్యాపార లక్ష్యాలు, మా క్లయింట్‌ల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంపెనీ నుంచి కొంతమంది ఉద్యోగులను తొలగించామని" కంపెనీ ధృవీకరించింది. 800 మంది ఫ్రెషర్ ఉద్యోగులను పరీక్ష తర్వాత తొలగించారని వార్తలు వచ్చాయి.

452 మంది
452 మంది ఫ్రెషర్లు శిక్షణ తర్వాత కూడా పదేపదే అసెస్‌మెంట్‌లలో పేలవ ప్రదర్శన చూపినందకు తొలగించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. ఉద్యోగులకు శిక్షణ కోసం కంపెనీ ఖర్చు చేసిన రూ.75,000 చెల్లించాల్సి ఉందని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే కంపెనీ దానిని మాఫీ చేసిందని తెలిసింది. "మీరు చెల్లించాల్సిన శిక్షణ ఖర్చు రూ. 75,000 మాఫీ చేస్తున్నామని " అని రద్దు లేఖలో పేర్కొన్నారు.

ఆఫర్ లెటర్లు
గతంలో రెండు కంపెనీల్లో వర్క్ చేస్తున్నారన్న కారణంతో 300 మందిని విప్రో తొలగించింది. కొందరు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పటికీ.. చేర్చుకునే విషయంలో విప్రో జాప్యం చేస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. దీన్ని విప్రో అంగీకరించింది. ఆన్‌బోర్డింగ్ విషయంలో తమ హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications