ముంబై: ఈ నెల 29వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు షేర్ల బైబ్యాక్ ఉంటుందని విప్రో వెల్లడించింది. రూ.9500 కోట్లకు పైగా షేర్లను ఒక్కొక్కటి రూ.400 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ బైబ్యాక్‌కు ఈ నెల 11వ తేదీని రికార్డు తేదీగా నిర్ణయించింది. జనవరి 20వ తేదీకి ముందే ఈ బైబ్యాక్ బిడ్స్ స్టాక్ ఎక్స్చేంజీల్లో సెటిల్ చేస్తామని వెల్లడించింది. మొత్తం 23.75 కోట్ల షేర్లను కంపెనీ బైబ్యాక్ చేయనుంది.
డిసెంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్న బైబ్యాక్ జనవరి 11 (2021)న ముగియనుంది. దేశీయ సాఫ్టువేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బైబ్యాక్ ఆఫర్ ప్రారంభ తేదీని ఇటీవల ప్రకటించింది. ఈ ఆఫర్ వ్యాల్యూ దాదాపు రూ.16వేలకోట్లు. డిసెంబర్ 18వ తేదీన ప్రారంభమైన బైబ్యాక్ జనవరి 1వ తేదీన ముగుస్తుంది. 5,33,33,333 వాటాలను బైబ్యాక్ చేసేందుకు టీసీఎస్ వాటాదారులు అనుమతిని ఇచ్చారు. ఒక్కో షేర్ రూ.3000 వద్ద కొనుగోలు చేయనున్నారు.

ప్రస్తుతం టీసీఎస్ వద్ద సెప్టెంబర్ చివరి నాటికి రూ.58,500 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. గతంలో ఒకసారి బోనస్‌ను ప్రకటించింది. అక్టోబర్ నెలలో ఈక్విటీ షేర్ పైన రూ.40 స్పెషల్ డివిడెండ్ ఇచ్చింది. ఇప్పుడు బైబ్యాక్‌ను ప్రకటించింది. టీసీఎస్‌తో పాటు మరో ఐటీ సంస్థ విప్రో కూడా బైబ్యాక్‌ను ప్రకటించింది. రూ.400 వద్ద రూ.9,500 కోట్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. కాగా, విప్రో షేర్ ధర నేడు 5.70 శాతం పెరిగి రూ.385 వద్ద ముగిసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications