Wipro Bonus Shares: దేశీయ టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో తన పనితీరును గడచిన కొన్ని త్రైమాసికాలుగా మెరుగుపరచుకుంటోంది. అగ్రస్థాయి యాజమాన్యంలో కీలక మార్పులు చేపట్టిన తర్వాత కంపెనీ తిరిగి పనితీరులో ట్రాక్ పైకి ఎక్కింది. దీనికి ముందు కంపెనీ ఆదాయాల క్షీణత, వ్యాపార క్షీణత వంటి కీలకమైన అడ్డంకులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇన్వెస్టర్లు మాత్రం వీటికి సంబంధించిన పరిణామాలను నిరంతరాయంగా పరిశీలిస్తూనే ఉన్నారు.
అయితే ఇప్పుడు విప్రో కంపెనీ ఇన్వెస్టర్లకు కంపెనీ భారీ శుభవార్తను ప్రకటించింది. ప్రస్తుతం దేశీయంగా స్టాక్ మార్కెట్లలో పతనం కొనసాగుతున్నప్పటికీ ఐటీ దిగ్గజం విప్రో మాత్రం తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా కోలాహలం నెలకొంది. అర్హులైన ఈక్విటీ పెట్టుబడిదారులకు కంపెనీ 1:1 నిష్పత్తిలో వీటిని అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం అర్హత పొందటానికి ఇన్వెస్టర్లకు డిసెంబర్ 3, 2024ను రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. అంటే ఈ సమయానికి తమ డీమ్యాత్ ఖాతాల్లో విప్రో షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులు కంపెనీ పుస్తకాల్లో నమోదు కాబడతారు. అలాంటప్పుడు వారికి బోనస్ షేర్లు బోర్డు నిర్ణయం మేరకు అందించబడతాయి. గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో ఈమేరకు చట్టపరంగా నిర్ణయాలు తీసుకోబడ్డాయి.

బోర్డు ఆమోదం తేదీ నుంచి 2 నెలలలోపు అంటే డిసెంబర్ 15, 2024 నాటికి షేర్లు క్రెడిట్ చేయబడతాయని విప్రో తెలిపింది. క్రెడిట్ తేదీ అనేది బోనస్ షేర్లు అర్హత కలిగిన షేర్‌హోల్డర్ల డీమ్యాట్ ఖాతాలలో షేర్లను జమచేసే డేట్. కంపెనీ చరిత్రను పరిశీలిస్తే 1971లో తొలిసారిగా తన పెట్టుబడిదారులకు ఉచితంగా బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ క్రమంలోనే 1981-1996 మధ్యకాలంలో టెక్ దిగ్గజం దాదాపు 6 సార్లు బోనస్ షేర్లు అందించింది. దీని తర్వాత 1997, 2004, 2005, 2010, 2017, 2019 సంవత్సరాల్లో పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను రివార్డ్ చేసింది. దేశీయంగా ఉన్న ఇతర టెక్ కంపెనీలతో పోల్చితే విప్రో తన పెట్టుబడిదారులకు భారీగా రాబడిని అందించింది. సహజంగా మార్కెట్లో కంపెనీ షేర్లకు లిక్విడిటీ పెంచటానికి కంపెనీ తన పెట్టుబడిదారులకు షేర్లను రివార్డ్ చేస్తుంటాయి.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్..
ఇటీవలి కాలంలో ఐటీ రంగంలోని పనిగంటలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే విషయాలపై భారీగా చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ స్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి యువతను వారానికి 70 గంటలు పనిచేయాలంటూ కామెంట్స్ చేయటం పెద్ద విమర్శకలకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ
కూడా స్పందించారు. ఈ మధ్యకాలంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఇది కొంత వివాదాస్పదమైన అంశంగానే ఉన్నప్పటికీ.. తమ సంస్థ ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అందుబాటులో ఉంచుతూ ప్రయోజనం చేకూరుస్తోందన్నారు. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ప్రస్తుతం కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను పూర్తిగా వారంలో 5 రోజులు ఆఫీసులకు రావాల్సిందే అని తేల్చి చెప్పనప్పటికీ కొన్ని మాత్రం ఫ్లెక్సిబిలిటీలను ఇప్పటికీ అందిస్తూనే ఉండటం గమనించాల్సిన విషయం.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications