wipro: అప్పుడు వెయిట్ చెయ్యమన్న విప్రో.. ఇప్పుడు వేటు వేసింది..
wipro: టెక్ కంపెనీలు తమ జీవితాలతో ఆటలాడుతున్నాయని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. దేశంలో టాప్ 5 కంపెనీల్లో ఒకటైన విప్రో సైతం ఈ కోవలో ఉండటం బాధాకరమని పేర్కొంటున్నారు. తాజాగా 800 మంది ఫ్రెషర్స్ ను తొలగిచడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంస్థలు కూడా పనికిరాని కారణాలు చెప్పి ఉద్యోగులను వదిలించుకోవడం సరికాదంటున్నారు.

శిక్షణ ఖర్చులు చెల్లించాలి కానీ...
శిక్షణ కోసం ఫ్రెషర్స్ పై ఖర్చు పెట్టిన రూ. 75 వేలు సంస్థకు తిరిగి చెల్లించాల్సి ఉండగా.. దానిని మాఫీ చేసినట్లు టెర్మినేషన్ లెటర్ లో విప్రో పేర్కొంది. పేలవమైన పనితీరే ఉద్యోగాల్లో కోతకు కారణమని వెల్లడించింది. తొలగింపులు వాస్తవమేనంటూ ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రశ్నకు విప్రో సమాధానమిచ్చింది. కానీ ఎంతమందిని తొలగించారనే విషయంపై స్పందించలేదు.

నైపుణ్యం లేదు:
విప్రో అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థ అని, వాటికి భంగం కలిగించే అంశమేదైనా తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. లక్ష్యాలను సాధించడం కోసం ప్రతి ఉద్యోగి నిర్దిష్ట నైపుణాలు ప్రదర్శించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. వ్యాపార ప్రక్రియ, క్లైంట్ ల అవసరాలను పరిగణలోనికి తీసుకుని ఫ్రెషర్స్ కి శిక్షణ ఇస్తామన్నారు. మొదటగా పూర్తి స్థాయిలో వారికి గైడెన్స్ అందించి పరీక్షిస్తామని.. లక్షాలను చేరుకోలేకపోతే మరోసారి శిక్షణ ఇచ్చి చూస్తామన్నారు. అప్పటికీ అనుకున్న స్థాయికి చేరకుంటే తొలగించక తప్పదని పేర్కొంది.

తొలగించడమే ఎజెండా:
అంతర్గత పరీక్ష పేరుతో ఉద్యోగులను వదిలించుకోవాలని విప్రో చూస్తోందని జాబ్ కోల్పోయినవారు ఆరోపిస్తున్నారు. ఎప్పుడో ఆఫర్ లెటర్ ఇచ్చినా ఆన్ బోర్డ్ చేయకుండా ఎందుకు ఇప్పటి వరకు వేదించారని ప్రశ్నిస్తున్నారు. తీరా నెలల వ్యవధిలోనే తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications