Wipro Q4 Result: ఐటీ రంగ దిగ్గజం విప్రో నేడు బుధవారం మార్చి 2025తో ముగిసిన నాల్గవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. మార్చి త్రైమాసికంలో విప్రో నికర లాభం రూ.3,570 కోట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే రూ.2,835 కోట్లుగా ఉంది. ఈ లాభం మార్కెట్ అంచనా రూ. 3,290 కోట్ల కంటే ఎక్కువ.అలాగే ఈ దిగ్గజ ఐటీ కంపెనీ ఆదాయం 1% పెరిగి రూ.22,504 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే కాలంలో చూస్తే రూ.22,208 కోట్లుగా ఉంది. మరోవైపు ఈరోజు విప్రో షేర్లు 2% పెరిగి రూ.247.60కి చేరుకున్నాయి. ఈ షేర్లు ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు 10% రాబడిని ఇవ్వగా, దీని మార్కెట్ క్యాప్ రూ.2.59 లక్షల కోట్లు.

నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం: 2024-25 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.22,504.2 కోట్లుగా ఉంది, అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో నమోదైన రూ.22,208.3 కోట్ల నుండి 1.33 శాతం స్వల్పంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)తో పోలిస్తే, కంపెనీ నికర లాభం 6.43 శాతం పెరగగా, ఆదాయం 0.83 శాతం పెరిగింది. 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 18.9 శాతం పెరిగి రూ.13,135.4 కోట్లకు చేరుకుందని స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన ప్రకటనలో కంపెనీ తెలిపింది. అయితే, ఈ కాలంలో కంపెనీ ఆదాయం 0.74 శాతం తగ్గి రూ.89,088.4 కోట్లకు చేరుకుంది.
కంపెనీ ఏం చెప్పిందంటే: బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మొదటి (ఏప్రిల్-జూన్) త్రైమాసికంలో ఐటీ సేవల వ్యాపారం నుండి వచ్చే ఆదాయం దాదాపు 1.5 శాతం నుండి 3.5 శాతం తగ్గి $2,505 మిలియన్ల నుండి $2,557 మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెండు పెద్ద డీల్స్ దక్కించుకుందని, వీటి వల్లే లాభాలు పెరిగిందని విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) శ్రీని పాలియా అన్నారు. విప్రో ఉద్యోగుల సంఖ్య గత ఏడాది ఇదే సమయంలో 2,32,614గా ఉండగా, ఈ త్రైమాసికం చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 2,33,346గా ఉంది.
విప్రో కంపెనీ గురించి : విప్రో లిమిటెడ్ అనేది ఒక ప్రముఖ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ సంస్థ. ఈ కంపెనీ 65 దేశాలలో కొనసాగుతుంది. అజీమ్ ప్రేమ్‌జీ 1966లో 21 సంవత్సరాల వయసులో తన తండ్రి నుండి విప్రోని వారసత్వంగా పొందాడు. ఆయన లీడర్షిప్ లో విప్రో వెజిటబుల్ ఆయిల్ ఉత్పత్తి నుండి ఐటీ సేవలు, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అండ్ కన్సల్టింగ్ సేవలను అందించడం వరకు విస్తరించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications