Wipro Q3 results: విప్రో లాభాల పంట.. 24% హైక్.. ప్రతి షేరుపై డివిడెండ్ ప్రకటన..
భారతీయ ఐటీ సేవల పరిశ్రమలో అగ్రగామి విప్రో భారీ ఎదురుదెబ్బ తర్వాత డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో(Q3) బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సీఈవో నుండి ఉద్యోగుల తొలగింపు వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విప్రో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కాగా, విప్రో డిసెంబర్ త్రైమాసిక నికర లాభం 24% పెరిగి రూ.3,354 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో విప్రో నిర్వహణ ఆదాయం కేవలం 0.5% పెరిగి రూ.22,319 కోట్లకు చేరుకుంది.
గత త్రైమాసికంతో పోలిస్తే పన్ను తర్వాత లాభం (PAT) దాదాపు 5% పెరిగింది అలాగే ఆదాయం 0.1%తో స్వల్పంగా పెరిగింది. ఈ త్రైమాసిక ఫలితాల గురించి విప్రో సిఇఒ శ్రీని బలిగా మాట్లాడుతూ, ఈ డిసెంబర్ త్రైమాసికంలో గత 3 సంవత్సరాలలో అత్యుత్తమ లాభాల మార్జిన్‌ను నమోదు చేశామని, అదే సమయంలో మా ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా పయనిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 11 శాతం వృద్ధితో రూ. 6,806 కోట్లు, టీసీఎస్ రూ. 12,380 కోట్లు, హెచ్‌సీఎల్ 6 శాతం వృద్ధితో రూ. 4,591 కోట్లు, విప్రో 24%వృద్ధితో రూ. 3,354 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి.

విప్రో లాభాల మార్జిన్ తక్కువగా ఉన్నప్పటికీ లాభాల్లో నమోదైన గ్రోత్ మెట్రిక్ అద్భుతంగా ఉంది. శ్రీని బలిగా నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ లాభదాయకతను పెంచడానికి అడ్మినిస్ట్రేటివ్ విధులను పునర్మించింది ఇంకా ఖర్చులను తగ్గించింది. కానీ ఆదాయాలు కేవలం 0.5 శాతం మాత్రమే పెరిగాయి, ఇది పెట్టుబడిదారులకు పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పవచ్చు. విప్రో ఐటి సేవల విభాగం ఆదాయం ఏడాది ప్రాతిపదికన కేవలం 1% పెరిగి $2.6 బిలియన్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా, త్రైమాసికానికి 1.2% క్షీణతతో వచ్చే సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. IT సేవల నిర్వహణ మార్జిన్ అంటే త్రైమాసికంలో లాభాల మార్జిన్ 17.5%, త్రైమాసికానికి 0.7% ఇంకా సంవత్సరానికి 1.5% పెరిగింది.
ఈ త్రైమాసికంలో విప్రో మొత్తం $3.5 బిలియన్ల విలువైన కాంట్రాక్ట్స్ పొందింది. వీటిలో $961 మిలియన్ విలువైన అతిపెద్ద కాంట్రాక్ట్స్ ఉంది. స్థిరమైన కరెన్సీ వాల్యుయేషన్ వద్ద వార్షిక ప్రాతిపదికన 6% పెరుగుదల. డిసెంబర్ త్రైమాసికం ముగింపులో విప్రో గత 12 నెలల్లో 15.3% అట్రిషన్ రేటును నివేదించింది. అలాగే, ఈ త్రైమాసికం చివరిలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు వాటాదారులకు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ఆమోదించినట్లు ప్రకటించింది. డివిడెండ్ రికార్డు తేదీ 28 జనవరి 2025. డివిడెండ్ ఈక్విటీ పెట్టుబడిదారులకు 15 ఫిబ్రవరి 2025 లేదా అంతకు ముందే చెల్లించబడుతుంది.


Click it and Unblock the Notifications