Wipro: ఇన్వెస్టర్లకు విప్రో బ్యాడ్ న్యూస్.. Q4లో లాభాలు ఆవిరి.. గత త్రైమాసికంతో పోలిస్తే..
IT News: మార్కెట్లో IT సంస్థల బజ్ నెలకొంది. వరుసగా దేశీయ టెక్ దిగ్గజాలు తమ నాల్గవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) సహా ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. కాగా ఇప్పుడు మరో సాంకేతిక సంస్థ విప్రో ఫలితాలు వెలువడ్డాయి. కాగా చివరికి ఇన్వెస్టర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.
బెంగళూరుకు చెందిన IT సేవల సంస్థ విప్రో మార్చి 2024తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 2 నేల 835 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే దాదాపు 8 శాతం తగ్గింది. QoQ చొప్పున చూస్తే మాత్రం 5.2 శాతం పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ అంచనా 2 వేల 771 కోట్లను మిచడం గమనార్హం. గత ఏడాదితో పోల్చి చూస్తే ఆదాయమూ 4.2 శాతం క్షీణించి 22 వేల 208 కోట్లు సంపాదించింది.

డాలర్ పరంగా IT సేవల ఆదాయం సంవత్సరానికి (YoY) 6.6 శాతం తగ్గింది. స్థిరమైన కరెన్సీలో వరుసగా 0.3 శాతం అంటే 2.66 బిలియన్ల మేర పడిపోయింది. ఇదే సమయంలో 1.2 బిలియన్ డాలర్ల మొత్తం కాంట్రాక్ట్ విలువతో భారీ డీల్స్‌ను కంపెనీ సొంతం చేసుకుంది.
'FY24 IT పరిశ్రమకు ఒక సవాలుగా ఉంది. స్థూల ఆర్థిక వాతావరణంలోనూ అనిశ్చితి కొనసాగుతోంది. మేము ఒక పెద్ద సాంకేతిక మార్పు అంచున ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మా క్లయింట్‌ల అవసరాలను మారుస్తోంది. వారు పోటీతత్వ ప్రయోజనాలు మరియు మెరుగైన వ్యాపార విలువ కోసం దాని శక్తిని ఉపయోగించుకుంటారు. దీనికోసం విప్రో సన్నద్ధమవుతోంది' అని విప్రో CEO శ్రీని పల్లియా తెలిపారు.
నాల్గవ త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్ గత 3 నెలల్లో సాధారణంగా నమోదవుతున్న 16 శాతం మరియు ఏడాది క్రితం 16.3 శాతం నుండి 16.4 శాతానికి విస్తరించింది. సవాళ్లు ఉన్నప్పటికీ FY24లో పూర్తి సంవత్సరానికి తమ IT సేవల మార్జిన్ 50 బేసిస్ పాయింట్లు పెరిగినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO ) అపర్ణ అయ్యర్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications