IT News: దేశీయ టెక్కీలకు బ్యాడ్ న్యూస్.. కంపెనీల నిర్ణయంతో ఆశల ఆవిరి.. పూర్తి వివరాలు..
IT News: భారతీయ IT ఉద్యోగులకు ఈ ఏడాది నిరాశే మిగిలిందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నాయి.
టాప్ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ ఈసారి జీతాల పెంపు అమలు చేయకూడదని నిర్ణయించాయి. సాధారణంగా తొలి త్రైమాసికం చివర్లో ఈ కంపెనీలు ప్రకటిస్తుంటాయి. ఇదే సమయంలో విప్రో మాత్రం జాతాల పెంపునకు కట్టుబడి ఉంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దీనికి సంబంధించిన ప్రకటనను కంపెనీ చేయొచ్చని తెలుస్తోంది.

టెక్ మహీంద్రా జూనియర్, మిడ్-లెవల్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను మంజూరు చేసింది. సీనియర్లకు మాత్రం వాయిదా వేసింది. TCS మాత్రం మునుపటి ఏడాది మాదిరిగానే 6%- 8% వరకు సగటు పెంపును ప్రకటించింది. ఇదే సమయంలో మంచి ప్రదర్శన చూపిన వారికి మాత్రం రెండంకెల హైక్ అందించింది. అలాగే మధ్యతరహా కేటగిరీలోని కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ తమ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
కంపెనీల నిర్ణయాలు వాటి డిమాండ్ ట్రెండ్‌లను పాక్షికంగా ప్రతిబింబిస్తున్నాయి. ఇన్ఫోసిస్ BFSI సెక్టార్‌లో మందగమనం నుంచి ప్రతికూల ప్రభావాలను చూసింది. జూన్ త్రైమాసికంలో విప్రో ఆదాయంలో 2.8% వరుస క్షీణతను ఎదుర్కొంది. బలహీనమైన స్థూల ఆర్థిక పరిస్థితులకు ప్రతిస్పందనగా వివిధ పరిశ్రమల్లోని వ్యాపారాలు విచక్షణతో కూడిన వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయని విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే పేర్కొన్నారు. అలాగే జూన్ త్రైమాసికంలో విప్రో తన ఉద్యోగుల సంఖ్యను 9,000 మేర తగ్గించింది.


Click it and Unblock the Notifications