Wipro News: అంతర్జాతీయ ఆర్థిక మందగమనం కారణంగా విదేశీ క్లయింట్స్ ITపై వెచ్చించే మొత్తాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. దీంతో ఇండియన్ IT రంగం కొంతమేర కుదేలైంది. ఇదికాస్తా ఉద్యోగుల వేరియబుల్ పే, హైక్ లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న వేళ.. ఇండియన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం విప్రో తన సిబ్బందికి గుడ్‌న్యూస్ చెప్పింది.
గత రెండు త్రైమాసికాల్లో సగటున 80 శాతం చొప్పున విప్రో తన ఉద్యోగులకు వేరియబుల్ పే విడుదల చేసింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఆ మొత్తాన్ని మరో 5 శాతం పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కంపెనీ ఆదాయంలో మూడింట ఒక వంతు వాటా కలిగి ఉన్న ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ బిజినెస్ శ్రేణికి సెప్టెంబర్ త్రైమాసికంలో 100 శాతం చెల్లించగా.. డిసెంబర్‌లో 89.74 శాతం ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

వేరియబుల్ చెల్లింపు 3 అంశాలకు లింక్ చేయబడుతుందని విప్రో తన ఉద్యోగులకు ఇటీవల పంపించిన మెయిల్‌లో పేర్కొంది. రాబడి (40 శాతం), స్థూల మార్జిన్ (30 శాతం) మరియు మొత్తం కాంట్రాక్ట్ విలువ (30 శాతం) ఆధారంగా పేమెంట్ చేయనున్నట్లు తెలిపింది. మార్జిన్లను పెంచడానికి కంపెనీ తన ఉద్యోగులకు జీతాల పెంపును రెండు నుంచి మూడవ త్రైమాసికానికి వాయిదా వేసింది.
గత త్రైమాసికాలను పరిగణలోనికి తీసుకుంటే విప్రో 22 వేల 205 కోట్ల ఆదాయంతో మార్కెట్ అంచనాలను అధిగమించింది. బలహీనమైన డిమాండ్, సీజనల్ కారణాలు, ఉద్యోగులకు జీతాల పెంపు వంటి గట్టి సవాళ్లు ఉన్నప్పటికీ.. కంపెనీ మార్జిన్‌లు స్థిరంగా ఉన్నాయి. ప్రత్యర్థి IT మేజర్ ఇన్ఫోసిస్ మొదటి రెండు త్రైమాసికాల్లో విప్రో మాదిరిగా 80 శాతం వేరియబుల్ చెల్లించింది. అయితే మూడో త్రైమాసికంలో దాని సగటు వేరియబుల్ పేని 73 శాతానికి తగ్గించడం గమనార్హం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications