IT News: భారతీయ టెక్ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. సిబ్బంది ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న జీతాల పెంపుపై బ్యాడ్ న్యూస్ చెప్పింది. అందులోనూ భారీగా జీతభత్యాలను పొందుతున్న ఉద్యోగులను పొమ్మనకుండా పొగపెట్టినట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
పాశ్చాత్య దేశాల క్లయింట్లు ఖర్చులు భారీగా తగ్గించుకోవడంతో IT దిగ్గజాల లాభాలు కూడా అదే స్థాయిలో క్షీణించాయి. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఆయా కంపెనీలు సిబ్బందికి లేఆఫ్స్ ఇచ్చి పొదుపు మంత్రాన్ని పఠిస్తున్నాయి. ఇదే కారణంతో కొందరు ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు విప్రో నిరాకరించింది.

సెప్టెంబరు 30 నాటికి 2.44 లక్షల మంది ఉద్యోగులు విప్రోలో పనిచేస్తున్నారు. వారికి జీతాల పెంపును ఇప్పటికే ఆలస్యం చేసింది. కాగా త్వరలోనే కంపెనీ నుంచి శుభవార్త వస్తుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు.. సంస్థ పంపించిన అంతర్గత మెమో చూసి మతిపోయింది. భారీ మొత్తంలో జీతాలు తీసుకుంటున్న సిబ్బంది బాగా పనిచేసినప్పటికీ.. వారికి ఈసారి మొండిచేయి చూపిస్తున్నట్లు అందులో పేర్కొంది.
తక్కువ పరిహారంతో నెట్టుకొస్తున్న ఉద్యోగులకు జీతాల పెంపు అమలు చేసేందుకు సిద్ధమైంది. 'అధిక పరిహారాన్ని పొందిన అత్యుత్తమ ప్రదర్శనకారులు ఈ సైకిల్‌లో కవర్ చేయబడకపోవచ్చు' అని ఎంటర్‌ప్రైజ్ ఫ్యూచరింగ్ బిజినెస్ లైన్ ప్రెసిడెంట్ నాగేంద్ర బండారు మెయిల్ చేశారు. అయితే కంపెనీ నిర్దేశించిన కేటగిరీలోని ఉద్యోగులకు డిసెంబర్ 1న పెంపుదలతో కూడిన జీతం అందనున్నట్లు సమాచారం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications