IT news: టెక్ దిగ్గజం విప్రో విడుదల చేసిన ఫలితాలపై సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థియరీ డెలాపోర్టే స్పందించారు. YoYలో కంపెనీ వార్షిక రాబడి 11.5 శాతం వృద్ధి చెందగా.. FY24 మొదటి త్రైమాసికంలో దీనివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఆదాయ వృద్ధిని -3 నుంచి -1 శాతానికి తీసుకురావాలని సంస్థ మార్గనిర్దేశం చేసినా, స్థూల ఆర్థిక పరిస్థితి సవాలుగా ఉండనున్నట్లు తెలిపారు. గత త్రైమాసికాల్లో మార్జిన్లు 16 శాతంగా ఉండవచ్చని అంచనా వేసినట్లు వెల్లడించారు.
స్థిర కరెన్సీ వద్ద 0.6 శాతం ఆదాయ వృద్ధి క్షీణతకు మార్కెట్‌లోని అనిశ్చితి, వ్యయంలో మందగమనం కారణమని డెలాపోర్టే తెలిపారు. దీర్ఘకాలిక అనిశ్చితి వల్ల తమ క్లయింట్లు, IT పరిశ్రమ సహా అనేక రంగాలు ప్రభావితమైనట్లు వెల్లడించారు. ఈ పరిణామాలు తమ బిజినెస్, అంచనాలను సైతం కుదుపునకు గురిచేసినట్లు చెప్పారు. అమెరికా మరియు యూరప్ మార్కెట్లు రెండింటిలోనూ QoQ ప్రాతిపదికన Q4లో వృద్ధి క్షీణత నెలకొన్నట్లు గుర్తుచేశారు. ఇదే సమయంలో ఆసియా పసిఫిక్/మిడిల్ ఈస్ట్/ఆఫ్రికా (APMEA) మార్కెట్ మాత్రం 0.7 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు.

కంపెనీ BFSI (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్) వర్టికల్స్ లో 2.4 శాతం QoQ క్షీణతను చూసింది. వినియోగదారుల్లో -0.9 శాతం, టెక్నాలజీలో -2.7 శాతం, తయారీలో -0.3 శాతం, కమ్యూనికేషన్స్ లో -0.4 శాతం దెబ్బతిన్నాయి. అయితే ప్రధానంగా ఎనర్జీ, సహజ వనరులు మరియు యుటిలిటీల నుంచి 5.9 శాతం, ఆరోగ్య విభాగం ద్వారా 2 శాతం వృద్ధి నమోదైంది.
BFSI, రిటైల్, ప్యాకేజ్డ్ ఉత్పత్తులు మరియు సాంకేతికతలో చెప్పుకోదగ్గ స్థాయిలో వృద్ధి సాధించలేదని CEO వెల్లడించారు. కన్సల్టింగ్ రంగంలో క్యాప్కో, రైజింగ్ వంటి కొనుగోళ్లను విప్రో జరిపినా అక్కడా పరిస్థితి స్తబ్ధుగానే ఉన్నట్లు తెలిపారు. మందగమనం వేళ మొదటగా ప్రభావితమయ్యేది కన్సల్టింగ్ కాగా.. తిరిగి వెంటనే పుంజుకునేది కూడా అదేనన్నారు. ఈ విభాగానికి సాంకేతిక నైపుణ్యం జోడిస్తూ క్లయింట్ల వద్ద నుంచి మరిన్ని డీల్స్ రాబడుతున్నట్లు చెప్పారు.
బ్యాంకింగ్ సంక్షోభం IT కంపెనీల ఫలితాలపై ప్రభావం చూపుతుందని అంచనా. యునైటెడ్ స్టేట్స్ లోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB), సిగ్నేచర్ బ్యాంక్ మరియు క్రెడిట్ సూయిస్ వంటి వివిధ ప్రాంతీయ బ్యాంకుల పతనం కారణంగా.. ఈ ఏడాది మొదటి 3 నెలలు పరిస్థితి దారుణంగా ఉంది. ప్రపంచ బ్యాంకింగ్ రంగం ఒక్కసారిగా పెద్ద కుదుపునకు లోనైంది. ఇప్పటికే స్థూల ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్న IT పరిశ్రమకు ఇది మరింత ఇబ్బందిగా తయారైంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications