Wipro News: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యపారాల పరిస్థితి అశాజనకంగా లేదు. దీంతో చాలా కంపెనీల యాజమాన్యాలు ఖర్చులను తగ్గించుకోవటానికి అనేక ప్రణాళికలను అమలు చేస్తున్నాయి.
ఇలాంటి సందర్బంలో దేశీయ ఐటీ దిగ్గజం విప్రో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తాను పొందుతున్న జీతం ప్యాకేజీలో 50 శాతం తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు. రిషద్ ప్రేమ్‌జీ FY2023 కోసం పరిహారంలో స్వచ్ఛందంగా తగ్గింపు తీసుకున్నారని విప్రో ధృవీకరించింది.

మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రిషద్ 9,51,353 డాలర్లను పరిహారంగా తీసుకున్నారు. ఇది మునుపటి సంవత్సరం పొందిన దాని కంటే దాదాపు 50 శాతం తక్కువ. విప్రో లిమిటెడ్ దాఖలు చేసిన ఫారమ్ 20-ఎఫ్ ప్రకారం.. రిషద్ ప్యాకేజీలో జీతం అలవెన్సులుగా 8,61,620 డాలర్లు పొందుతున్నారు. ప్యాకేజీలో 74,343 డాలర్లు పరిహారం, 15,390 డాలర్లు ఇతర వనరుల నుంచి ఆదాయం కూడా ఉంది.
బిలియనీర్ అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఐదేళ్ల పదవీకాలం జూలై 30, 2024తో ముగియనుంది. 2007లో విప్రోలో చేరిన రిషద్ 2019లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. కెరీర్ ప్రారంభంలో విప్రో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ వ్యాపారంలో జనరల్ మేనేజర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. విప్రోలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఐటి కంపెనీ విప్రో నికర లాభం 0.4 శాతం మేర స్వల్పంగా క్షీణించి రూ.3,074.5 కోట్లుగా నమోదైంది. కిందటి ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.3,087.3 కోట్లుగా ఉంది. ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11.17 శాతం పెరిగి రూ.23,190.3 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications