Wipro News: రూ.25 కోట్లు కట్టాల్సిందే అంటున్న టెక్ దిగ్గజం విప్రో.. అరె ఎందుకిలా..??
Wipro-Jatin Dalal row: ఐటీ కంపెనీల మధ్య పోటీ కారణంగా ఏర్పడుతున్న సమస్యలు ప్రస్తుతం తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇందుకు కాగ్నిజెంట్ అసలు కారణంగా నిలుస్తోంది.
వాస్తవానికి ఐటీ దిగ్గజం విప్రో మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ కంపెనీని వీడి ప్రత్యర్థి కాగ్నిజెంట్‌లో చేరటంతో వివాదం మెుదలైంది. విప్రో దీనిని చాలా సీరియస్‌గా తీసుకుని బెంగళూరు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. జతిన్ కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత ఏడాది గడవక ముందరే ప్రత్యర్థి సంస్థలో చేరటం నాన్-కాంపిటేట్ నిబంధనల ఉల్లంఘన అంటూ కోర్టుకు తెలిపింది.

నిబంధనలు పాటించనందుకు గాను దలాల్ నుంచి నష్టపరిహారంగా రూ.25.15 కోట్లను విప్రో డిమాండ్ చేసింది. పైగా ఈ ఏడాది కాలానికి 18 శాతం వడ్డీని సైతం డిమాండ్ చేసింది. వాస్తవానికి సుదీర్గకాలం కంపెనీలో పనిచేసిన దలాల్ విప్రోలో చివరిగా పనిచేసిన తేదీ నవంబర్ 30, 2023. వాస్తవానికి కాగ్నిజెంట్‌లో తన కొత్త పాత్రలో 2024 ప్రారంభంలో పదవీ విరమణ చేయాలనుకుంటున్న జాన్ సీగ్మండ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
సెప్టెంబరులో రాజీనామా చేస్తున్న తరుణంలో దలాల్ తన ఇతర కెరీర్ అవకాశాలను కొనసాగించడానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పట్లో కంపెనీ ఆయన స్థానంలో అపర్ణ సి అయ్యర్‌ను CFOగా నియమించింది. కాగ్నిజెంట్‌లో తన కొత్త పాత్రలో దలాల్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రణాళిక & విశ్లేషణ, అకౌంటింగ్ & కంట్రోలర్‌షిప్, పన్ను, ట్రెజరీ, అంతర్గత ఆడిట్, కార్పొరేట్ అభివృద్ధి, పెట్టుబడిదారుల సంబంధాలు & ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి వివిధ ఆర్థిక విధులను పర్యవేక్షిస్తారు. అయితే వరుస రాజీనామాలు కంపెనీని ఇటీవల ఆందోళనకు గురిచేస్తున్నాయి.


Click it and Unblock the Notifications