Wipro: ఐటీ ఉద్యోగుల ఇళ్లలో సంబురాలు.. వేరియబుల్ పేపై విప్రో తియ్యటి కబురు..
Wipro: క్రమశిక్షణ పేరుతో ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్న ఐటీ దిగ్గజం విప్రో ఎలాగైతేనేం శుభవార్తను ప్రకటించింది. ఉత్యోగులకు రెండవ త్రైమాసికానికి చెల్లించాల్సిన వేరియబుల్ పేని చెల్లించడంపై కీలక ప్రకటన చేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో.. కంపెనీ పనితీరుతో పే-అవుట్ లింక్ చేయబడిన ఉద్యోగులందరికీ ఇది ఊరటను ఇస్తోంది.

ఉత్సాహంలో ఉద్యోగులు..
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో A నుంచి B3 బ్యాండ్‌లలోని ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే చెల్లింపు ఉంటుందని విప్రో వెల్లడించింది. విప్రో క్యూ2 ఆదాయం 14.6 శాతం పెరిగి రూ.22,540 కోట్లుగా నమోదైంది. వేరియబుల్ పే ఫ్రెషర్, టీమ్ లీడర్ స్థాయిల్లో హ్యాండ్ అవుట్ చేయబడుతుంది. మిగిలిన ఉద్యోగులు వారి యునిట్ టార్గెట్ అచీవ్ చేసిన ఆధారంగా చెల్లింపులను పొందుతారని కంపెనీ వెల్లిడించింది.

కంపెనీ మెయిల్..
కంపెనీ పాలసీ పనితీరు ప్రకారం వేరియబుల్ పే 93.5%కి వస్తుందని.. అయితే పురోగతిని ప్రతిబింబించేలా 1.07 అధిక గుణకాన్ని ప్రకటించాలని విప్రో ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్ పంపింది. నవంబర్ పేరోల్‌లో ఉద్యోగులు వేరియబుల్ వేతనాన్ని పొందుతారని కంపెనీ వెల్లడించింది. అయితే దీనిని పొందటానికి ఉద్యోగులు కనీసం 50 శాతం యుటిలైజేషన్ లెవల్ కలిగి ఉండాలని మెయిల్ లో స్పష్టం చేసింది.

85 శాతం ఉద్యోగులకు..
2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి కంపెనీలోని 85 శాతం మంది ఉద్యోగులు వేరియబుల్ పే 100 శాతం అందుకుంటారని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఇదే క్రమంలో కంపెనీ హ్యూమన్ రిసోర్సెస్ తో పాటు వ్యాపార వృద్ధిపై కూడా పెట్టుబడులు పెట్టటం కొనసాగిస్తామని విప్రో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఇవే విషయాలను విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను థియరీ డెలాపోర్టే క్యూ2 ఫలితాల కాన్ఫరెన్స్ సందర్భంగా ఇతకు ముందు వెల్లడించారు.

ఉద్యోగులకు పదోన్నతలు..
వేరియబుల్ పే ప్రకటించడమే కాకుండా.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీ ఈ ఏడాది ఇప్పటివరకు 16,000 మంది ఉద్యోగులకు అంతర్గతంగా పదోన్నతులను కల్పించింది. విప్రో గతంలో ఏడాది ప్రాతిపదికన ఉన్న ప్రమోషన్స్ సైకిల్ ను త్రైమాసిక ప్రమోషన్ సైకిల్‌కు మార్చింది. పెరుగుతున్న అట్రిషన్ రేటును తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది.

TCS..
ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సెప్టెంబర్ త్రైమాసికంలో 70 శాతం మంది ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే ఇస్తోంది. ఈ వారం ప్రారంభంలో మరో టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ తన వ్యాపారంలోని కొన్ని విభాగాల్లోని ఉద్యోగులకు సగటున 60 శాతం చెల్లించింది. ఐటీ కంపెనీలు మార్జిన్ల ఒత్తిడి నేపథ్యంలో వేరియబుల్ చెల్లింపులను జాగ్రత్తగా ప్రకటిస్తున్నాయి.


Click it and Unblock the Notifications