విప్రో చేతికి బ్రెజిల్ ఐటీ కంపెనీ, రికార్డ్‌స్థాయిలో దూసుకెళ్లిన షేర్
ముంబై: భారత ఐటీ దిగ్గజం విప్రో షేర్లు సోమవారం భారీగా ఎగిశాయి. బ్రెజిల్ దేశానికి చెందిన ఐటీ సంస్థ ఇవియా సెర్వియోస్ సంస్థని చేజిక్కించుకున్నట్లు రెండు రోజుల ప్రకటించింది. ఇందుకు 22.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.170 కోట్లు) వెచ్చించింది. ఈ కంపెనీ టేకోవర్ ప్రక్రియ ముగిసినట్లు శనివారం తెలిపింది. బ్రెజిల్ ఐటీ కంపెనీని చేజిక్కించుకోవడంతో ఇన్ఫోసిస్ షేర్ ధర సోమవారం భారీగా పెరిగింది.

అందుకే విప్రో కీలక నిర్ణయం
బ్రెజిల్‌లోని డెవలప్‌మెంట్, ఆపరేషనల్, మెయింటినెన్స్, కన్సల్టింగ్, ఐటీ సేవలు అందిస్తుంది ఇవియా సెర్వియోస్. ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్రవేసిన విప్రో ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలపై దృష్టి సారించింది. ఇవియా సెర్వియోస్‌లో 700కు పైగా ఉద్యోగులు ఉన్నారు. దీని కొనుగోలు ద్వారా బ్రెజిల్‌లో విప్రో తన సేవలను మరింతగా విస్తరించనుంది. బ్రెజిల్‌లో ఐటీ రంగంలో పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా విప్రో కీలక నిర్ణయం తీసుకుంది.

విప్రో షేర్ జూమ్
విప్రో శనివారమే ఈ ప్రకటన చేసింది. దీంతో ఈ ఐటీ దిగ్గజం షేర్ ధర సోమవారం ఎగిసిపడింది. మార్కెట్ ముగిసే సమయంలో 2.53 శాతం ఎగిసి రూ.283.50 పలికింది. ఓ సమయంలో 3.54 శాతం ఎగిసింది. ఇవియా సెర్వియోస్‌కు సంబంధించిన విషయాన్ని విప్రో జూలై లోనే ప్రకటించింది. తాజాగా శనివారం ఈ కొనుగోలు ముగిసిందని ప్రకటించడంతో విప్రో షేర్ దూసుకెళ్లింది. విప్రో షేర్ 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల సగటు కంటే ఎక్కువగా పెరిగింది. ఈ షేర్ ధర ఏడాదిలో 13 శాతం ఎగిసింది. ఈ ఏడాది ప్రారంభం నుండి 14.56 శాతం పుంజుకుంది.

విప్రో మార్కెట్ క్యాప్
విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.61 లక్షల కోట్లు పెరిగి, రూ.4.32 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో కూడా విప్రో కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో విప్రో ఆదాయం దాదాపు ఫ్లాట్‌గా రూ.15,871 కోట్లుగా ఉంది. అంతకుముందు ఇదే కాలంలో రూ.15,566 కోట్లు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications