Wipro News: విప్రో సంస్థ ఛైర్మన్, ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయన సంపాదించిన దానిలో ఎక్కువ భాగం ఛారిటీ చేస్తూ సమాజానికి తిరిగి వాటిని ఇస్తుంటారు. వ్యాపార అనిశ్చితులు కొనసాగుతున్న వేళ తాజాగా ఆయన విప్రో వ్యాపారంపై కీలక కామెంట్స్ చేశారు.
వ్యాపార ప్రతికూలతలు కొనసాగుతున్న తరుణంలో విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తమ కన్జూమర్ కేర్ వ్యాపారంపై ఆశాజనకంగా ఉన్నారు. విప్రో కన్స్యూమర్ కేర్ & లైటింగ్ కింద పనిచేసే సంస్థ FY23లో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అలాగే కంపెనీ ఫ్లాగ్‌షిప్ సంతూర్ సోప్ బ్రాండ్ ద్వారా రూ.2,650 కోట్లను ఆర్జించింది. కంపెనీ యార్డ్లీ, ఎన్‌చాన్‌టూర్, చంద్రిక, సాఫ్ట్‌టచ్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. దేశీయంగా, విదేశీ మార్కెట్ల మధ్య ఆదాయాలు సమానంగా ఉండటం గమనించాల్సిన విషయం.

ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో విప్రో కన్స్యూమర్ కేర్ & లైటింగ్ ఉన్నట్లు ప్రేమ్‌జీ వెల్లడించారు. తలసరి వినియోగం ప్రస్తుతం తక్కువగా ఉన్నందున అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో FMCG బాగా వృద్ధి చెందుతోందని వెల్లడించారు. భారత్, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లో కంపెనీ వృద్ధి కొనసాగుతోంది. ఈ మార్కెట్లలో ముఖ్యమైన ఎఫ్‌ఎమ్‌సీజీ ప్లేయర్‌గా స్థిరపడటానికి ఉన్న అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని విప్రో అందిపుచ్చుకుంది.
విప్రో నుంచి వేరుచేయబడిన కన్స్యూమర్ వ్యాపారం.. హిందుస్థాన్ లీవర్ (రూ. 61,092 కోట్లు), అదానీ విల్మార్, ఐటీసీ (నాన్ సిగరెట్ ఎఫ్‌ఎంసీజీ), నెస్లే ఇండియా, బ్రిటానియా, డాబర్‌లు ముందున్నాయి. 2003లో విప్రో కన్స్యూమర్ రూ.300 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉండగా దానిలో సగం సంతూర్ నుంచి వచ్చింది. ప్రస్తుతం కంపెనీ బ్రాండ్ బిల్డింగ్ పై ఎక్కువగా దృష్టి సారించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications