Wipro Soaps: మనలో చాలా మందికి విప్రో అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఐటీ సేవల్లో టాప్ కంపెనీ అని. అయితే కంపెనీ వాస్తవ ప్రస్థానం గురించి మనలో చాలా మందికి తెలియదు. సంతూర్ మమ్మీ యాడ్ మనం చూసే ఉంటాం అయితే ఈ సబ్బులను తయారు చేసే కంపెనీ విప్రో అని మనలో చాలా మందికి తెలియదు.
వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా విప్రో తన కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ వ్యాపారాన్ని వేగంగా విస్తరించే పనిలో ఉంది. ఈ క్రమంలో కొత్త బ్రాండ్లను, ఉత్పత్తులను కొనుగోలు చేస్తూనే ఉంది. తాజాగా కంపెనీ జో, డోయ్, బాక్టీర్ షీల్డ్ సోప్ బ్రాండ్లను వీవీఎఫ్ ఇండియా నుంచి కొనుగోలు చేసింది. అయితే డీల్ విలువ ఎంతనే వివరాలు బయటకు రాలేదు. పర్సనల్ వాష్ కేటగిరీలో వ్యాపారాన్ని విస్తరించేందుకు తాజా కొనుగోళ్లు కలిసొస్తాయని కంపెనీ భావిస్తోంది.

తాజా కొనుగోలుతో అజీమ్-ప్రేమ్‌జీ నేతృత్వంలోని విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమైన విప్రో కన్స్యూమర్ కేర్, పర్సనల్ వాష్ సెగ్మెంట్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. FY23 అమ్మకాలతో కంపెనీ దేశంలో రెండవ అతిపెద్ద సోప్ బ్రాండ్ సంతూర్ రూ.2,650 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. అలాగే కంపెనీ చంద్రికా పేరుతో ఆయుర్వేద సోప్ విక్రయాలను సైతం చేస్తోంది.
గత ఏడాది కాలంలో విప్రో మెుత్తంగా మూడు కంపెనీలను కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటివరకు 15 కొనుగోళ్లు జరిగాయి. జో, డోయ్, బాక్టీర్ షీల్డ్ బ్రాండ్లు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.210 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే ఆహార ఉత్పత్తుల కేటగిరీలో నిరప్పర, బ్రాహ్మిణ్స్ బ్రాండ్లను విప్రో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ తాజా కొనుగోళ్లు హిందుస్థాన్ యూనీలివర్ కు చెందిన లక్స్, లైఫ్ బాయ్ బ్రాండ్లతో పాటు.. గోద్రేజ్ కు చెందిన సింతాల్, నెంబర్-1, అలాగే డెటాల్ వంటి ఉత్పత్తులతో పోటీ పడేందుకు సిద్ధమైంది.


Click it and Unblock the Notifications