IT News: వరుస అనిశ్చితుల వల్ల ఖర్చులు తగ్గించుకునేందుకు పలు దేశాలు మార్గాలను వెతుకుతున్నాయి. దీంతో అవి IT సేవలపై వెచ్చించే మొత్తంలో భారీ క్షీణత ఏర్పడింది. ఈ నిర్ణయం IT కంపెనీల ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే పాశ్చాత్య దేశాల్లోని దిగ్గజ సంస్థలతో పోలిస్తే భారతీయ IT కంపెనీల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పవచ్చు.
దేశీయ IT మేజర్ విప్రో అదిరిపోయే శుభవార్త చెప్పింది. వేలాది కోట్ల విలువైన భారీ ప్రాజెక్టును చేజిక్కించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ.. సంస్థ ఉద్యోగులకు ఈ న్యూస్ మంచి భరోసా ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికాకు చెందిన ఓ ప్రముఖ కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఈ డీల్ వచ్చినట్లు విప్రో పేర్కొంది. ఆ సంస్థ ఉత్పత్తుల డెవలప్‌మెంట్‌తో పాటు నిర్వహణ సేవలు కూడా అందించనున్నట్లు చెప్పింది. కాగా ఈ భారీ ఒప్పందం విలువ 4 వేల 175 కోట్లు అని వెల్లడించింది. 5 ఏళ్లపాటు సదరు కంపెనీకి తాము సర్వీస్ ఆఫర్ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
సంస్థను వేగంగా వృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పనిస్తున్నామని విప్రో కొత్త CEO శ్రీనివాస్ పలియా ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పుడు భారీ డీల్ సొంతం చేసుకుంది. ఇది కంపెనీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కఠిన పరిస్థితుల్లోనూ భారత IT రంగం వృద్ధిని చూసి పలు దేశాలు కుళ్లుకుంటున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications