Premji Invest: దేశంలోని టాప్-5 ఐటీ సేవల కంపెనీల్లో ఒకటి విప్రో లిమిటెడ్. దీనిని ప్రారంభించిన వ్యక్తి అజిమ్ ప్రేమ్‌జీ. తాజా పరిణామాలను చూస్తుంటే ఆయన ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యాపారంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ బ్యాంక్ వాటాలు కొనుగోలు చేసేందుకు చర్చలు జరపటం మార్కెట్లలో ఇన్వెస్టర్లను ఒక్కసారిగా ఆకర్షించింది.
వివరాల్లోకి వెళితే ప్రభుత్వ యాజమాన్యంలోని బీఓబీకి నైనిటాల్ బ్యాంకులో 98 శాతం వాటా ఉంది. అయితే గత కొంత కాలంగా బ్యాంక్ ఆఫ్ బరోడా దీనిలోని 51 శాతం వాటాను విక్రయించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే అజిమ్ ప్రేమ్‌జీ కుటుంబ ఆఫీసు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ఈ వాటాను కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులు అందించిన సమాచారంతో మార్కెట్లో ఈ వార్త పెద్ద వైరల్ అయ్యింది.

అజీమ్ ప్రేమ్‌జీ గత ఏడాది కాలంగా పెట్టుబడుల దూకుడును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కంపెనీ నుంచి అగ్రనాయకత్వం వరుసగా తప్పుకుంటున్నప్పటికీ విప్రో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై ఎక్కువగా దృష్టి సారించింది. ఈ విభాగంలోని కంపెనీలను కొనుగోలు చేసి పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ దీనికి సంబంధించిన షరతులతో కూడిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీల నుంచి ఆమోదం లభిస్తే త్వరలోనే డీల్ కార్యరూపం దాల్చుతుందని నిపుణులు చెబుతున్నారు.
నైనిటాల్ బ్యాంక్ వాస్తవానికి ఉత్తరాఖండ్ ప్రధాన కార్యాలయంగా వ్యాపారం కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.800 కోట్లుగా అంచనా వేయబడింది. గత ఏడాది అక్టోబరులో టెక్ క్రంచ్ సంస్థ నివేదిక ప్రకారం నైనిటాల్ బ్యాంకులో పెట్టుబడులకు బ్రోకరేజ్ సంస్థ జెరోధా, పేమెంట్స్ సంస్థ మెుబిక్విక్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వాటాలు కొనే రేసులో ఉన్నట్లు నివేదించింది. ఒకవేళ లావాదేవీ విజయవంతంగా పూర్తైతే నైనిటాల్ బ్యాంక్ ఇటీవల కొనుగోలు చేసిన ఇతర చిన్న రుణదాతల జాబితాలో చేరుతుంది. BharatPe యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 49% వాటాను కొనుగోలు చేసింది. ఇదే క్రమంలో ఫిన్‌టెక్ యునికార్న్ స్లైస్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో విలీనం ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ డీల్ కుదిరితే బ్యాంకింగ్ రంగంలో అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం పెట్టిన తొలి పెట్టుబడి ఇదే అవుతుంది. ఈ డీల్ నైనిటాల్ బ్యాంక్ పునర్నిర్మాణానికి తొలి అడుగు కావచ్చు. 1922లో ప్రారంభించబడిన బ్యాంక్ అక్కడి స్థానిక ప్రజల అవసరాలకోసం రూపొందించబడింది. అయితే ఆ తర్వాత 1973లో ఆర్బీఐ బ్యాంక్ కార్యకలాపాలను పర్యవేక్షించవలసిందిగా బ్యాంక్ ఆఫ్ బరోడాను ఆదేశించింది. ప్రస్తుతం బ్యాంక్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, హర్యానా, రాజస్థాన్ వంటి ఐదు రాష్ట్రాల్లో 168 శాఖలతో పనిచేస్తోంది. నైనిటాల్ బ్యాంక్‌ని స్వాధీనం చేసుకోవడం ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించడానికి ఒక అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications