Azim Premji: మనలో చాలా మందికి నారాయణమూర్తి స్పూర్తిని నింపే వ్యక్తి. అయితే ఆయన జీవితంలో ఎదురైన తిరస్కరణ ఒక కంపెనీని స్థాపించటానికి పరోక్షంగా కారణమైంది. దీనికి సంబంధించిన వివరాలను మూర్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి చేసిన మెుదటి ఉద్యోగం ఐఐటీ అహ్మదాబాదులో రీసెర్చ్ అసోసియేట్. అక్కడ ఆయన చీఫ్ సిస్టమ్ ప్రోగ్రామర్‌గా పనిచేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఉద్యోగం కోసం విప్రోలో ప్రయత్నించగా.. అజీమ్ ప్రేమ్‌జీ తనను ఉద్యోగానికి నియమించుకోకుండా తిరస్కరించారని వెల్లడించారు. ఈ నియామక తప్పిదం జరగకుండా ఉండి ఉంటే ఇన్ఫోసిస్ కథ వేరే విధంగా ఉండేదని నారాయణమూర్తి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఐటి పరిశ్రమలో విప్రోకు ముఖ్యమైన ప్రత్యర్థుల్లో ఒకటి ఇన్ఫోసిస్. అయితే ప్రేమ్ జీ నారాయణమూర్తి ఉద్యోగ దరఖాస్తు తిరస్కరణ ఇన్ఫోసిస్ పుట్టుకకకు దారితీసిందని.. తనను ఉద్యోగంలోకి తీసుకోకుండా ప్రేమ్‌జీ చేసిన అతిపెద్ద తప్పుగా మూర్తి పేర్కొన్నారు. జనవరి 12, 2024 నాటికి ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.6.65 లక్షల కోట్లుగా ఉండగా.. విప్రో విలువ మాత్రం కేవలం రూ.2.43 లక్షల కోట్లకు పరిమితమైంది.
నారాయణమూర్తి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోసం బేసిక్ ఇంటర్‌ప్రెటర్, కంప్యూటర్‌ను నిర్మించడంలో పాలుపంచుకున్నాడు. ఇన్ఫోసిస్ ప్రారంభానికి ముందు మూర్తి సాఫ్ట్‌ట్రానిక్స్ కంపెనీని స్థాపించారు. అయితే ఈ కంపెనీ విఫలమైంది. ఆ తర్వాత పూణేలోని పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో మూర్తి ఉద్యోగానికి చేరారు. అయితే తాను పనిచేస్తున్న కాలంలో వారానికి 70 గంటలు పనిచేసేవాడినని భారతీయ యువత సైతం దీనిని అలవరుచుకోవాలని అప్పుడే దేశం ఎదుగుతుందని ఇటీవల చేసిన కామెంట్స్ పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు ఆయన భార్త సుధామూర్తి సైతం మద్ధతుగా నిలిచారు.


Click it and Unblock the Notifications