Wipro News: ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటి నుంచి పనిచేసిన ఉద్యోగులకు టెక్ కంపెనీలు ఒక్కొక్కటిగా షాక్ ఇస్తున్నాయి. TCS, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు తన సిబ్బందిని ఆఫీసు నుంచి పని చేయాలని ఆదేశాలు జారీచేశాయి. కాగా మరో భారతీయ సంస్థ ఇప్పుడు వాటి దారిలోనే నడుస్తోంది.
వారానికి మూడు రోజుల పాటు కార్యాలయాలకు తిరిగి రావాలని టెక్ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. ఈ హైబ్రిడ్ వర్క్ పాలసీని తప్పనిసరిగా అందరూ ఫాలో కావాలని కోరింది. ఈ తరహా విధానం ద్వారా 'మూన్ లైటింగ్' వంటి పలు ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చని టెక్ కంపెనీల ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

'కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల టీమ్ వర్క్ మెరుగుపడటంతో పాటు ఉద్యోగుల మధ్య మంచి రిలేషన్ పెంపొందుతుంది. విప్రో పని సంస్కృతిని బలోపేతం చేయడమే మా లక్ష్యం' అని కంపెనీ చీఫ్ నుంచి ఉద్యోగులకు మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. పాలసీలో తీసుకొచ్చిన మార్పులు.. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సహాయ పడతాయని సంస్థ భావిస్తోంది.
వివిధ దేశాలు తమ స్థానిక నిబంధనలను పాటించేలా కొన్ని మార్పులు చేస్తామని విప్రో పేర్కొన్నట్లు సమాచారం. ఇందుకోసం కొన్ని యూరోపియన్ దేశాల్లో కంపెనీ యాజమాన్యం ఉద్యోగ సంఘాలతో మాట్లాడతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ పాలసీకి కట్టుబడి ఉండకపోతే జనవరి 7, 2024 నుంచి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications