Wipro results: ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న ఆర్థిక అనిశ్చితి భారతీయ IT కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మార్జిన్ లు పెద్ద మొత్తంలో పడిపోయాయి. ఇటీవల వెలువడిన వివిధ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కాగా ఇవాళ టెక్ దిగ్గజం విప్రో తన రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇతర ప్లేయర్స్ మాదిరిగానే తన ఆదాయానికి భారీగా గండి పడినట్లు ప్రకటించింది.
సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి గాను 2 వేల 646 కోట్ల కంసాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసినట్లు విప్రో వెల్లడించింది. గత త్రైమాసికంలో సాధించిన 2 వేల 870 కోట్లతో పోలిస్తే 7.8 శాతం రాబడి క్షీణించినట్లు తెలిపింది. FY23 Q2 తో పోలిస్తే PAT ఫ్లాట్ గా ఉన్నట్లు స్పష్టం చేసింది. గ్రాస్ రెవెన్యూ 225.2 బిలియన్లకు చేరుకోగా.. YOYతో పోలిస్తే 0.1 శాతం తగ్గుదల నమోదైనట్లు చెప్పింది.

IT సేవలు విభాగం ఆదాయం 2 వేల 713 కోట్లుగా నమోదయింది. అంటే గత క్వార్టర్ తో పోలిస్తే 2.3 శాతం మేర క్షీణించింది. టోటల్ బుకింగ్స్ 3.8 బిలియన్ డాలర్లు కాగా.. YoY 6 శాతం వృద్ధి కనిపించింది. 1.3 బిలియన్ డాలర్ల మేర లార్జ్ డీల్స్ అందుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ విభాగంలో ఏకంగా 79 శాతం మెరుగుదల కనబరిచింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ సెగ్మెంట్ EBIT ఈ త్రైమాసికానికిగాను 36.1 బిలియన్లుగా నమోదయింది. YoY 6 శాతం వృద్ధి సాధించింది. 10 బేసిస్ పాయింట్ల మెరుగుదలతో ఆపరేటింగ్ మార్జింగ్ 16.1 శాతంగా రికార్డయింది. గతేడాదితో పోలిస్తే 4.1 శాతం వృద్ధితో EPS 5 రూపాయలకు పైగా బలపడింది. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నికర ఆదాయంలో 140 శాతంగా ఉంది. గత 9 క్యార్టర్లలో అత్యల్ప ఉద్యోగుల అట్రిషన్ రేట్ 13.4 శాతం నమోదైంది.


Click it and Unblock the Notifications