విమానయాన రంగానికి అసలు కఠిన పరీక్ష ముందుంది..

కరోనా వైరస్ ప్రభావం విమాయానరంగంపై భారీ ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం దారుణంగా దెబ్బతిన్నది. అన్ని దేశాలు కూడా అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులు నిలిపివేశాయి. అయితే 2020 క్యాలెండర్ ఏడాది మూడో క్వార్టర్‌లో 40 శాతం లాభాలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ప్రయాణాలు దాదాపు నిలిచిపోయాయి.

ఆ తర్వాత క్రమంగా కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ లాభాలు ఉద్యోగుల వేతనం, ఇంధనం, రుణ బిల్లుల చెల్లింపులకు కొంతలో కొంత ఊరట దక్కుతుంది. అంతకుముందు క్వార్టర్‌లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి! గత క్వార్టర్‌తో పోలిస్తే ఈ క్వార్టర్‌లో ఎయిర్‌లైన్స్ స్టాక్ సూచీలు కూడా పెరిగాయి. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఆగస్ట్ నెలలో ఎయిర్ లైన్స్ స్టాక్స్ 18 శాతం ఎగిశాయి. ఈ నివేదిక తయారు తయారు చేస్తోన్న ఇరవై సంవత్సరాల్లో ఇలా పెరగడం ఇదే మొదటిసారి.

బ్యాలెన్స్ షీట్ బాగుంది..

బ్యాలెన్స్ షీట్ బాగుంది..

కార్యకలాపాలు తెరుచుకుంటుండటంతో విమానయాన సంస్థ క్రమంగా కోలుకుంటోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో లో-కాస్ట్ స్ట్రక్చర్, బలమైన బ్యాలెన్స్ షీట్ ఈజీజెట్ పీఎల్‌సీ మంచి స్థితిలో ఉంది. అంతేకాదు, బ్రిటిష్ ప్రభుత్వం రెండో హామీ రుణంపై చర్చలు జరుపుతోంది. ఇబ్బందుల్లో విమానయాన సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదని ప్రకటించిన అనంతరం పిలిప్సీన్‌కు చెందిన సిబు ఎయిర్ ఇంక్ 500 బిలియన్ డాలర్ల బాండ్స్, ప్రిఫర్డ్ షేర్లను సమీకరిస్తోంది.

మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా గ్రూప్ సుదూర అనుబంధ ఎయిర్ ఏషియా ఎక్స్ బీహెచ్‌డీ పునర్నిర్మాణాన్ని ప్రకటించింది. ఎయిర్ ఏషియా ఇండియా లిమిటెడ్‌కు నిధులను నిలిపివేసింది. జపాన్‌లో కార్యకలాపాలు నిలిపివేసింది.

మలేషియాకు చెందిన మలేషియా ఎయిర్ లైన్స్ పునర్వ్యవస్థీకరణపై రుణదాతలతో సంప్రదింపులు జరుపుతోంది.

లైఫ్ సపోర్ట్ పైన అమెరికా విమానయానం

లైఫ్ సపోర్ట్ పైన అమెరికా విమానయానం

అమెరికాలో ఈ రంగం లైఫ్ సపోర్ట్ పైన ఉంది. ఎన్నో రంగాలపై కరోనా ప్రభావం పడింది. విమానయాన రంగంపై కనివినీ ఎరుగని విధంగా పడింది. బ్లూమ్ బర్గ్ ఇంటెలిజెన్స్ అలిస్ట్ జార్జ్ ఫెర్గున్సన్ నివేదిక ప్రకారం యూరోపియన్, నార్త్ అమెరికన్ ఎయిర్ లైన్స్ డొమెస్టిక్ ట్రావెల్ షెడ్యూల్ డిసెంబర్ క్వార్టర్‌లో 45 శాతం తగ్గించాయి. కరోనా ఇప్పటికే క్లోజ్ అవుతుందని అన్ని రంగాలతో పాటు విమానయాన రంగం ఆశలు పెట్టుకుంది. కానీ అది నెరవేరలేదు. ఆగస్ట్ నాటికి కరోనా మరణాలు తగ్గినప్పటికీ, మళ్లీ ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి.

బ్యాలెన్స్ షీట్ జీరోకు రాకముందే..

బ్యాలెన్స్ షీట్ జీరోకు రాకముందే..

విమానయాన రంగానికి దారుణ పరిస్థితి ముందు మరింత ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి కార్యకలాపాలు నిలిచిపోయి, బ్యాలెన్స్ షీట్ పైన ప్రభావం, ప్రభుత్వాలు, పెట్టుబడిదారుల నుండి బెయిలవుట్ చర్యలు, ఇంధన ఆదా, నిర్వహణ ఖర్చులు తగ్గడం వంటివి ఇన్నాళ్లు కనిపించాయి. ఇప్పటి వరకు ఉద్యోగాల కోత, వివిధ మార్గాలకు రాకపోకలు నిలిపివేయడం వంటివి చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఉన్న వాటి కంటే మున్ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని, నగదు సున్నాకి తగ్గకముందే క్యారియర్లు కఠినమైన, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+