IPO News: మే 6న వస్తున్న ఐపీవో.. గ్రేమార్కెట్లో తుఫాను పెరుగుదల.. బెట్టింగ్ కి రెడీనా..??
Winsol Engineers IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు ముదిరిపోయారు. గతంలో మాదిరిగా ఎక్కువగా ఈక్విటీలపై వారు ఫోకస్ చేయటం లేదు. దీనికి బదులు రోజుల్లో డబ్బును రెట్టింపు చేస్తున్న ఐపీవోలపై గురిపెడుతున్నారు. రెండేళ్లుగా వస్తున్న వరుస ఐపీవోలు బెట్టింగ్ వేస్తున్న ఇన్వెస్టర్లను మాత్రం లాభాలతో అనుగ్రహిస్తున్నాయి.
ఈ క్రమంలోనే మే 6న మార్కెట్లోని రిటైల్ పెట్టుబడిదారుల సబ్‌స్క్రిప్షన్ కోసం విన్సోల్ ఇంజనీర్స్ వచ్చేస్తోంది. కంపెనీ ఐపీవోపై ఇప్పటికే సూపర్ హైప్ కొనసాగుతోంది. దీంతో అసలు షేర్లు పెట్టుబడిదారుల కోసం తెరుచుకోకముందే గ్రేమార్కెట్లో ప్రీమియం ధర పలుకుతూ సునామీ సృష్టిస్తున్నాయి. వాస్తవానికి కంపెనీ సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి వ్యాపారంలో నిమగ్నమైన ఉంది. కంపెనీ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల బెట్టింగ్ కోసం మే 6 నుంచి మే 9 వరకు అందుబాటులో ఉండనుంది.

ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఒక్కో షేరుపై వాస్తవ ఇష్యూ ధర కంటే 125 శాతం ప్రీమియం కొనసాగుతోంది. ఐపీవోలో పెట్టుబడిదారుల కొనుగోలు కోసం కంపెనీ గరిష్ఠ ఇష్యూ ధరను రూ.75గా ప్రకటించింది. ఈ లెక్కన ప్రస్తుతం గేమార్కెట్ ప్రీమియం ఒక్కో షేరుకు రూ.95 పలుకుతోంది. అంటే ఇదే లిస్టింగ్ రోజు వరుక కొనసాగితే ఒక్కో షేరు రూ.170 వద్ద మార్కెట్లోకి అరంగేట్రం చేయెుచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఐపీవోలో కంపెనీ షేర్లను పొందే పెట్టుబడిదారుల సంపద రెట్టింపు అవనుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం షేర్ల కేటాయింపు మే 10న, మార్కెట్ లిస్టింగ్ మే 14న ఉండొచ్చని తెలుసతోంది.
ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న కంపెనీ ఐపీవో ద్వారా ఇన్వెస్టర్ల నుంచి రూ.రూ.23.36 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించింది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ ఐపీవోలో పెట్టుబడి పెట్టాలనుకుంటే కనీసం రూ.1,20,000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 100 శాతం వద్ద ఉండగా.. ఐపీవో ప్రక్రియ పూర్తైన తర్వాత ఇది 72.99 శాతానికి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 2015లో స్థాపించబడిన కంపెనీ ఐపీవో నుంచి సేకరించిన సొమ్మును వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications