Winsol Engineers IPO: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల రద్దీ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు సైతం తమ డబ్బును ఎందులో బెట్ వేయాలా అనే గందరగోళంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గ్రేమార్కెట్లో రెచ్చిపోతున్న ఐపీవో ఇప్పటికీ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాన్ని తెరిచే ఉంచింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది విన్‌సోల్ ఇంజనీర్స్ ఐపీవో గురించే. ఐపీవో గ్రేమార్కెట్లో ప్రీమియం లాభాల సునామీ కొనసాగిస్తున్న వేళ కంపెనీ ఐపీవోపై రిటైలర్లు భారీగా బెట్టింగ్ కాస్తున్నారు. నేడు ఐపీవో సబ్‌స్క్రిప్షన్ రెండవ రోజు మధ్యాహ్నానికి విన్‌సోల్ ఇంజనీర్స్ ఐపీవో 59 కంటే ఎక్కువ సార్లు సభ్యత్వం పొందింది. మే 6న తెరవబడిన ఐపీవో మే 9 వరకు పెట్టుబడిదారుల దరఖాస్తు కోసం అందుబాటులో ఉండనుంది. మరో పక్క గ్రేమార్కెట్లో విన్‌సోల్ స్టాక్ ఒక్కోటి 200 శాతం ప్రీమియం ధర పలుకుతోంది.

దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి కంపెనీ తన ఐపీవో ద్వారా మెుత్తం రూ.23.36 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఐపీవో అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధర రూ.75 వద్ద లిస్టింగ్ జరుగుతుందని భావిస్తే.. దీనికి ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఉన్న ప్రీమియం రూ.150 కలిపి లిస్టింగ్ రోజున విన్సోల్ ఇంజనీర్స్ షేర్లు దాదాపు ఒక్కోటి రూ.225 రేటుకు బలమైన జాబితాను కలిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అంటే ఐపీవోలో విన్‌సోల్ ఇంజనీర్స్ షేర్లను పొందే పెట్టుబడిదారులు లిస్టింగ్ రోజున 200% భారీ లాభాన్ని అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షేర్ల కేటాయింపు మే 10న ఉండగా.. మార్కెట్లో జాబితా మే 14న ఉండనుంది.
రెండవ రోజున మధ్యాహ్నం 12 గంటల వరకు 59.71 సార్లు సభ్యత్వం పొందింది. కంపెనీ ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 99.43 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ క్రమంలో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో వాటాలు 45.44 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 1.14 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. కంపెనీ తాజాగా నిర్వహిస్తున్న ఐపీవో లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించింది. ఎవరైనా పెట్టుబడిదారుడు కంపెనీ షేర్లపై బెట్టింగ్ వేయాలనుకుంటే అందుకోసం కనీస పెట్టుబడిగా రూ.1.20 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 100 శాతంగా ఉండగా.. అది ఐపీవో తర్వాత 72.99 శాతానికి పరిమితం కానుంది.


Click it and Unblock the Notifications