For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Windows 11: పాత కంప్యూటర్..ఇక కలర్‌ఫుల్: డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ ఇలా

|

వాషింగ్టన్: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. తన కొత్త విండోస్ 11 (Windows 11) ఆపరేటింగ్ సిస్టమ్‌ను డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొద్దిరోజుల కిందటే విండోస్ 11ను లాంఛనప్రాయంగా ప్రారంభించిందా టెక్ జెయింట్. డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 నెక్స్ట్ వర్షన్, అప్‌గ్రేడ్ చేసిన విండోస్ 11ను లాంచ్ చేసింది. విండోస్ 10తో పోల్చి చూస్తే.. కొన్ని సరికొత్త ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అప్‌గ్రేడ్ చేసిన వర్షన్ లుక్‌ నీలం రంగులో మెరిసిపోతూ కనిపిస్తోంది.

Jan Dhan పథకానికి ఏడేళ్లు: ఎన్నో బెనిఫిట్స్: లక్షన్నర కోట్లుJan Dhan పథకానికి ఏడేళ్లు: ఎన్నో బెనిఫిట్స్: లక్షన్నర కోట్లు

కలర్‌ఫుల్‌గా

కలర్‌ఫుల్‌గా

పాత కంప్యూటర్లు విండోస్ 11 డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్లేషన్‌తో కలర్‌ఫుల్‌గా మారిపోతాయనడంలో సందేహాలు అక్కర్లేదు. చాలా సంవత్సరాల తరువాత విండోస్ అప్‌గ్రేడ్ వర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ కంపెనీ 2010లో విండోస్ 10ను ఆవిష్కరించింది. ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణుడు సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ అధినేతగా బాధ్యతలను స్వీకరించిన తరువాత విడుదల చేసిన న్యూ వర్షన్ విండోస్ ఆపరేషన్ సిస్టమ్ ఇది.

ఇంటెల్ కోర్ ఎక్స్ ఉందా?

ఇంటెల్ కోర్ ఎక్స్ ఉందా?

ఈ న్యూ లుక్, న్యూ వర్షన్‌ను వినియోగదారులకు అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటిదాకా కొత్త విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10తో ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇంటెల్ కోర్ ఎక్స్- సిరీస్, గ్జియాన్ డబ్ల్యూ- సిరీస్, ఇంటెల్ కోర్ 7820 హైక్వాలిటీలకు విండోస్ 11 సపోర్ట్ చేస్తుంది. ఐఎస్ఓ ఫైల్ ద్వారా వినియోగదారులు విండోస్ 11ను మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఒక గిగా హెర్ట్జ్ లేదా అంతకుమించిన సామర్థ్య ఉన్న 64-బిట్ సీపీయూ, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న పాత కంప్యూటర్లలో ఇది ఇన్‌స్టాల్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

64-బిట్ సీపీయూ, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

64-బిట్ సీపీయూ, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

ఒక గిగా హెర్ట్జ్ లేదా అంతకుమించిన సామర్థ్య ఉన్న 64-బిట్ సీపీయూ, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, యూఈఎఫ్ఐ సెక్యూర బూట్, 2.ఓ టీపీఎం రిక్వైర్‌మెంట్ ఉన్న గ్రాఫిక్స్ కనీసంగా ఉండాలని సూచించింది. జూన్‌లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను లాంచ్ చేసే సమయంలో- ఇంటెల్ ఎనిమిదవ జనరేషన్ ఉన్న పాత కంప్యూటర్లలోనూ ఇది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మార్కెట్ రీసెర్చ్ డేటా ప్రకారం చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు ఇన్‌స్టాల్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇది.

విండోస్ 10 టు

విండోస్ 10 టు

విండోస్ 10 వినియోగదారులు ఉచితంగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్‌డేట్ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. లైవ్ టైల్స్‌తో కూడిన విండోస్ 11 స్టార్ట్ మెను ఐకాన్స్ స్క్రీన్ అడుగున మధ్యలో కనిపిస్తాయి. విండోస్ 11లో యాప్ స్టోర్ ఆండ్రాయిడ్ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. డెల్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ 11 అందుబాటులోకి రావడంతో దీని వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అంచనా వేస్తోంది.

పీసీ హెల్త్ చెక్ యాప్ అప్‌గ్రేడ్..

పీసీ హెల్త్ చెక్ యాప్ అప్‌గ్రేడ్..

ఈ న్యూ వర్షన్‌ను డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే.. తొలుత విండోస్ 10కు అప్‌గ్రేడ్ అయి ఉండాలి. ఇదిలావుండగా.. విండోస్ 11తో పాటు మైక్రోసాఫ్ట్ యాజమాన్యం పీసీ హెల్త్ చెక్ యాప్‌ను కూడా డెవలప్ చేసింది. కొత్త వర్షన్‌లోకి దాన్ని తీసుకొచ్చింది. 2.0 లేదా సెక్యూర్ బూట్‌తో ఈ పీసీ హెల్త్‌చెక్ యాప్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని తెలిపిందా కంపెనీ. మాక్ఓఎస్, క్రోమ్ ఓఎస్ ఉపయోగించే వారికి విండోస్ 11 వినియోగం చాలా సులభతరంగా ఉంటుందని తలెిపింది. డీఫాల్ట్ సెట్టింగ్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకునే ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది.

English summary

Windows 11: పాత కంప్యూటర్..ఇక కలర్‌ఫుల్: డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ ఇలా | Windows 11: Microsoft has announced that it will now allow people to install on most older PCs.

Tech giant Microsoft has announced that now it will allow people to install Windows 11 on most older PCs. The Microsoft has slightly updated system requirements for a Windows 11.
Story first published: Saturday, August 28, 2021, 13:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X