Suzlon Energy: విండ్ ఎనర్జీ రంగంలో వ్యాపారం చేస్తున్న సంస్థ సుజ్లాన్ ఎనర్జీ. తన సుదీర్ఘ ప్రయాణంలో కంపెనీ అనేక సార్లు పెద్ద ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు పడుతున్న వేళ కంపెనీ వ్యాపారం పుంజుకుంది.
ఈ క్రమంలో కంపెనీ పారదర్శకతను మెరుగుపరిచే క్రమంలో వ్యాపర పునర్నిణాన్ని ప్రస్తుతం ప్రారంభించింది. దీనిలో భాగంగా సుజ్లాన్ ఎనర్జీ బోర్డ్ కంపెనీ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ సుజ్లాన్ గ్లోబల్ సర్వీసెస్‌ను మాతృ సంస్థతో విలీనానికి ఆమోదం తెలిపింది. అలాగే కంపెనీ తన వద్ద ఉన్న జనరల్ రిజర్వ్, పంచని లాభాల సొమ్మును ట్రాన్ఫర్ చేయాలని నిర్ణయించింది. మారిషస్‌లోని అనుబంధ సంస్థ సుజ్లాన్ ఎనర్జీని మాతృసంస్థలో కలిపేయాలని చూస్తోంది.

కంపెనీ చేస్తున్న తాజా మార్పుల వల్ల షేర్ హోల్డింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించింది. అయితే తగిన అనుమతులు పొందిన తర్వాత ప్రతిపాధించిన విలీనాన్ని కంపెనీ 6-10 నెలల కాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇక్కడ సుజ్లాన్ గ్లోబల్ సర్వీసెస్ ఇతర వ్యాపారాలతోపాటు విండ్ టర్బైన్ జనరేటర్ల ఆపరేషన్, నిర్వహణను నిర్వహిస్తోంది. ఇది సుజ్లాన్ ఎనర్జీకి పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ కాబట్టి ఎలాంటి షేర్ల కేటాయింపులు ఉండబోవని కంపెనీ స్పష్టం చేసింది.
గ్రూప్ వ్యాపారాలను ఏకీకృతం చేయటం ద్వారా పారదర్శకత మరింత మెరుగుపడుతుందని కంపెనీ పేర్కొంది. అలాగే పబ్లిక్ సెక్టార్ యూనిట్ బిడ్‌లకు ముఖ్యమైన ప్రమాణం అయిన ఈ విలీనం దాని స్టాండ్-అలోన్ బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేస్తుందని కూడా సుజ్లాన్ ఎనర్జీ తెలిపింది. రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్ జనవరి 2008లో రికార్డు స్థాయిలో రూ.459.80ని తాకింది. సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 16 ఏళ్ల కాలంలో వారి రికార్డు గరిష్ట స్థాయి నుండి 91% క్షీణించి ప్రస్తుతం రూ.41.50 రేటు వద్ద ట్రేడవుతోంది.
సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ ఏడాది కాలంలో మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. కంపెనీ షేర్లు గత ఏడాదిలో 411% పెరిగగా.. మూడేళ్లలో 782%, గడచిన ఐదేళ్లలో 570.11% రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. కంపెనీ షేర్లలో ర్యాలీ తర్వాత ఇటీవల కొంత ప్రాఫిట్ బుకింగ్ చూశాయి. స్టాక్‌బాక్స్‌లోని టెక్నికల్ అనలిస్ట్ కుశాల్ గాంధీ కంపెనీ షేర్లకు రూ.49.50 టార్గెట్ ధరగా అందిస్తూ.. ఇన్వెస్టర్లు రూ.38.50ను స్టాప్ లాస్ ధరగా ఉంచుకోవాలని సూచించారు. దీంతో కంపెనీ షేర్లపై రిటైల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఆసక్తిగా ఉన్నారు. సోమవారం మార్కెట్లలో కంపెనీ షేర్ల బలమైన ర్యాలీని చూడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications