ఈ రోజుల్లో జేబులో రూపాయి లేకపోయినా చేతిలో క్రెడిట్ కార్డ్ (Credit Card) ఉంటే చాలు.. ఏదైనా కొనేయొచ్చు అనే ధీమా పెరిగిపోయింది. ఇండియాలో క్రెడిట్ కార్డ్ వినియోగం మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. తాజా గణాంకాల ప్రకారం.. నవంబర్ 2025 నాటికి దేశంలో ఏకంగా 11.5 కోట్ల యాక్టివ్ కార్డ్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ఖర్చులు కూడా ఏడాదికేడాది పెరుగుతూ రూ. 1.89 ట్రిలియన్లకు చేరుకున్నాయి. అయితే ఇంతా వాడేస్తున్నాం. కానీ, ఒకవేళ సరైన సమయానికి బిల్లు కట్టకపోతే బ్యాంకులు వేసే వడ్డీలు చూస్తే చుక్కలు కనిపిస్తాయి.

ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అదే క్రెడిట్ కార్డ్ (Credit Card) వడ్డీ రేట్లపై ఒక పరిమితి (Cap) విధించడం. మరి ఈ రూల్ మన దేశంలో కూడా వస్తే ఎలా ఉంటుంది? అసలు ఇది సాధ్యమేనా?
ఇండియాలో క్రెడిట్ కార్డ్ పరిస్థితి ఏంటి?
మన దగ్గర క్రెడిట్ కార్డ్ వాడకం ఒక అలవాటుగా మారిపోయింది. 2024లో 10.7 కోట్లుగా ఉన్న కార్డుల సంఖ్య, 2025 నాటికి 7.1 శాతం పెరిగింది. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్, ఈ-కామర్స్ ఆఫర్ల పుణ్యమా అని మధ్యతరగతి ప్రజలు కూడా క్రెడిట్ కార్డుల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, ఇక్కడే ఒక తిరకాసు ఉంది. క్రెడిట్ కార్డ్ అనేది 'అన్‌సెక్యూర్డ్ లోన్' (ఎటువంటి గ్యారెంటీ లేని అప్పు). అందుకే బ్యాంకులు దీనిపై దాదాపు 30% నుండి 45% వరకు వడ్డీ వసూలు చేస్తాయి.
వడ్డీ రేట్లు తగ్గిస్తే బ్యాంకులు మునిగిపోవా?
ట్రంప్ ప్రతిపాదన ప్రకారం వడ్డీ రేట్లను తగ్గిస్తే అమెరికాలో వినియోగదారులకు ఏడాదికి 75 నుండి 100 బిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని అంచనా. కానీ బ్యాంకింగ్ నిపుణులు మాత్రం ఇది ప్రమాదకరమైన నిర్ణయం అంటున్నారు. బ్యాంకుల వాదన ఏంటంటే "క్రెడిట్ కార్డ్ అనేది రిస్క్ తో కూడుకున్నది. వడ్డీ రేట్లను బాగా తగ్గించేస్తే (ఉదాహరణకు 10% కి), బ్యాంకుల నిర్వహణ ఖర్చులు కూడా రావు."
ఒకవేళ ఇండియాలో కూడా ఇలాంటి నిబంధన వస్తే, బ్యాంకులు ప్రతి ఒక్కరికీ కార్డ్ ఇవ్వడం మానేస్తాయి. కేవలం మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారికే కార్డులు ఇస్తాయి. దీనివల్ల సామాన్యులు మళ్లీ పాత పద్ధతిలో వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది.
RBI నిర్ణయం ఏంటి?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రస్తుతం వడ్డీ రేట్లపై నియంత్రణను బ్యాంకులకే వదిలేసింది. స్వేచ్ఛా విపణిలో బ్యాంకులు తమ రిస్క్ ఆధారంగా వడ్డీని నిర్ణయించుకుంటాయి. ఒకవేళ రాజకీయ ఒత్తిడితో వడ్డీ రేట్లు తగ్గిస్తే.. అది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందనివిశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఏదేమైనా ట్రంప్ ఆలోచన అమెరికాలో వర్కవుట్ అవుతుందేమో! కానీ, ఇండియాలో అలాంటి ప్లాన్ చెల్లదు. క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు తగ్గడం వినియోగదారులకు వినడానికి బాగున్నా.. అది అమల్లోకి రావడం అంత సులభం కాదు. కాబట్టి కార్డు వాడేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటిస్తూ సమయానికి బిల్ కడుతూ వడ్డీలో ఊభిలో చిక్కుకోకుండా ఉండడం ఒక్కటే మన జేబుకు రక్షణ!
More From GoodReturns

చిన్న పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లు విడుదల చేసిన కేంద్రం.. PPF, NSC వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..

Reward points: రూ. 2 లక్షల టిక్కెట్ కేవలం రూ. 4,600కే! క్రెడిట్ కార్డ్ తో మీరు కూడా ఇలా చేయొచ్చు..

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications